For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్యూబ్‌లైట్ ఫెయిల్ అయితే పండుగ చేసుకొన్నారు.. వారంటే నాకు అసహ్యం.. సల్మాన్

  By Rajababu
  |

  బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌‌ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకొన్నది. ట్యూబ్‌లైట్ చిత్రం కమర్షియల్ హంగులకు దూరంగా ఉండటంతో సల్లూభాయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫ్లాప్‌గా ట్యూబ్‌లైట్ మిగిలింది. ఇటీవల ఓ జాతీయ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ ట్యూబ్‌లైట్ ఫ్లాప్ అయినందుకు కొందరు పండుగ చేసుకొన్నారనే షాకింగ్ విషయాలను వెల్లడించారు.

  ప్రతీ సినిమాకు సత్తాను నిరూపించుకోవాలి..

  ప్రతీ సినిమాకు సత్తాను నిరూపించుకోవాలి..

  ప్రస్తుతం టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో శారీరక, మానసిక అంశాలపై ప్రజలందికీ భారీగా అవగాహన కలుగుతున్నది. చాలా రంగాలకు చెందిన నిపుణులు పలు అంశాలతో మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. దాంతో మనల్ని కొత్తగా ఆవిష్కరించుకొనేందుకు వీలు కలుగుతున్నది. ఒక సినిమా తర్వాత మరో సినిమాకు నీ సత్తాను నిరూపించుకోవాల్సి వస్తున్నది.

  Salman Khan Controversial Comments On Baahubali And South Viewers
  ఆ రోజుల్లో ఇలాగా శ్రమ పడాల్సిన అవసరం లేదు

  ఆ రోజుల్లో ఇలాగా శ్రమ పడాల్సిన అవసరం లేదు

  శరీరాన్ని కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా శిక్షకులను, డైటీషియన్లను నియమించుకోవాల్సి వస్తున్నది. గతంలో హీరోలకు ఇన్ని రకాల పనులను చేయాల్సిన అవసరం లేకపోయింది. ఆ రోజుల్లో పరాటాలు, చపాతీలు తింటే సరిపోయేది.

  గైడెన్స్ ఇచ్చే సీనియర్ నటులు లేరు

  గైడెన్స్ ఇచ్చే సీనియర్ నటులు లేరు

  ఆరోగ్యాన్ని ఎలా చక్కబెట్టుకోవాలనే అంశాన్ని సీనియర్ నటులను చూస్తే సరిపోతుంది. ప్రస్తుతం అలా గైడెన్స్ ఇచ్చే నటులే మన చుట్టుపక్కల కనిపించరు. ఫిట్‌నెస్ గురించి నేను, అక్షయ్ కుమార్ చాలా శ్రద్ధ తీసుకొంటాం. ఆరోగ్య సంరక్షణ గురించి మేము ఎన్నో నేర్చుకొన్నాం.

  సూపర్ స్టార్లుగా కావాలని కలకనే వాళ్లం..

  సూపర్ స్టార్లుగా కావాలని కలకనే వాళ్లం..

  సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తొలినాళ్లలో జాకీ ష్రాఫ్, సంజయ్ దత్ సూపర్ స్టార్లు. అంత పెద్ద నటులను చూసి మేము కూడా ఆ స్థాయికి చేరుకోవాలనే కలలు కనేవాళ్లం. ఎప్పుడైనా ఆ స్థాయికి చేరుకొంటామా అని భయపడేవాళ్లం.

  ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేవాళ్లం

  ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేవాళ్లం

  మేము యంగ్ హీరోలుగా ఉన్నప్పుడు సన్నీడియోల్ శరీరాన్ని దృఢత్వంపై ఆయన ఎక్కువ దృష్టిపెట్టేవాళ్లు. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆ సమయంలో నా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆందోళన చెందే వాడిని. నా కెరీర్ విషయంలో నేను ఇంకా ఏదో చేయాలని అప్పుడు అనిపించింది. ఫిట్‌నెస్ విషయంలో సన్నీ, సంజయ్‌లను ఆదర్శంగా తీసుకొన్నాను. ఆ తర్వాత జీత్, సాజన్ అనే చిత్రాలు విజయాన్ని అందించాయి.

  సినిమాలు ఆడకపోతే భయం ఉంటుంది..

  సినిమాలు ఆడకపోతే భయం ఉంటుంది..

  సినిమాలు ఆడకపోతే నేను చాలా ఆందోళన చెందుతాను. చాలా మంది డబ్బులు పోతాయనే భయం వెంటాడుతూ ఉంటుంది. అందుకే మంచి సినిమాలు చేయాలనే తపనతో ఉంటాను. అందుకే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొంటాను. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తున్నప్పుడు చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. మూడు నాలుగు సినిమాలు పోయాయంటే పరిశ్రమ నుంచి నువ్వు అవుట్ అనే భయం ఉంటుంది. ఆ విషయం పరిశ్రమ వర్గాలను నిరుత్సాహానికి గురిచేస్తుంది.

  ట్యూబ్‌లైట్ ఫెయిల్ అయితే పండుగ చేసుకొన్నారు..

  ట్యూబ్‌లైట్ ఫెయిల్ అయితే పండుగ చేసుకొన్నారు..

  కొందరి హీరోల సినిమాలు పరాజయం పొందితే చాలా మంది పండుగ చేసుకొంటారు. హిట్లు వస్తే వారు సహించలేరు. వీడేంది.. సక్సెస్‌తో ఎగిసిపడుతున్నాడు. భగవంతుడు అన్నీ చూసుకొంటాడులే అని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒకరి సినిమాలు ఆడోద్దని కోరుకునే వాళ్లను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. ట్యూబ్‌లైట్ సినిమా ఫెయిల్ అయినందుకు ఆనందంలో ఎగిరి గంతేసిన వాళ్లు నాకు తెలుసు.

  సినిమా ఫెయిల్ అయితే అందరికీ నష్టం

  సినిమా ఫెయిల్ అయితే అందరికీ నష్టం

  ఒక సినిమా ఫెయిల్ అయితే ఎందరికి నష్టమో వారికి తెలియదు. నా సినిమా ఫెయిల్ అయితే నాకు ఒక్కడికే నష్టం కాదు. చిత్ర యూనిట్ సభ్యులు, వారి ఫ్యామిలీ, పంపిణీదారులు, థియేటర్ ఓనర్లు, అభిమానులకు చాలా నష్టం జరుగుతుంది. ఇలాంటి దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఫెయిల్ కావొద్దని కోరుకోవద్దు అని సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

  English summary
  Salman Khan is one of the biggest superstars of the country. Nobody expected that his film Tubelight will get such a lukewarm response. The actor is very disappointed with the failure of his recent movie. ''Some people get happy when somebody's film does not do well. They are like bahut udd raha tha, chalo accha hai, upar waale ki laathi... But I hate it when someone's movie doesn't do well. Because not only him... the whole staff, the unit, his family, the exhibitors, the theatre owners, his fans his entire life gets affected. You can't wish bad for someone's life."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X