మోడీపై విమర్శలు: బిగ్ బాస్ షోలో విచుకుపడ్డ సల్మాన్

By Bojja Kumar

హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టక ముందు నుండి ఆయనకు సన్నిహితులుగా, మద్దతుగా ఉంటున్న వ్యక్తుల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఒకరు. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందుకున్న కొద్ది మంది ప్రముఖుల్లో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారంటే....మెడీ ఆయనకు ఎంత విలువ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.

Salman Khan Speaks up For Narendra Modi

తాజాగా నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ వంద రోజుల్లో మోడీ చేసిందేమీ లేదని విమర్శలకు దిగారు. మోడీపై వస్తున్న విమర్శలపై సల్మాన్ ఖాన్ తనదైన రీతిలో స్పందించారు. మోడీ అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులు మాత్రమే అయింది. మెడీ తన టీంతో కలిసి ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి పని చేస్తున్నారు. ఆయనకు మరింత సమయం ఇవ్వండి' అంటూ త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ రియాల్టీ షో కొత్త సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

మోడీపై తనకు పూర్తి నమ్మకం ఉందని, దేశాన్ని ప్రగతి పథకంలో నడిపిస్తారని సల్మాన్ ఖాన్ అభిప్రాయ పడ్డారు. అంతే కాకుండా ఇటీవల విదేశీ పర్యటనలో మోడీ డ్రమ్స్ ప్లే చేయడాన్ని సల్మాన్ ప్రశంసించారు. ఆయన ఎంతో బాగా డ్రమ్స్ ప్లే చేసారని, వెరీ వెల్, వెరీ కూల్ అని ప్రశంసించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X