సల్మాన్ కు నరాల బలహీనత-ఆ పని తగ్గిచాలంటున్నడాక్టర్లు
వరుస షూటింగులతో పని ఒత్తిడి పెరిగి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆరోగ్యం బాగా చెడి పోయింది. ఫలితంగా శరీరంలోని నరాలు వీక్ అయి ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధి భారిన పడ్డారు. ఇది దవడ భాగానికి సంబంధించిన వ్యాది. ఈ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లిన సల్మాన్ కు సర్జరీ నిన్న విజయవంతంగా పూర్తయింది. దాదాపు ఐదు గంటల పాటు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. 15 రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
సల్మాన్ ఖాన్ బిజీ షెడ్యూల్ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం బాడీగార్డు సినిమా ప్రమోషన్ లో బీజీగా ఉన్న ఈ హీరో యష్ రాజ్ ఫిల్మ్ఖ్స్ 'షేర్ థా టైగర్"లోనూ పని చేస్తున్నారు. ఈ విధంగా విరామం లేకుండా శ్రమిస్తున్నందు వల్లనే ఆరోగ్యం పాడైందని, ఆ పనులు కాస్త తగ్గించు కోవాలని వైద్యులు సూచించారు.
salman khan bodyguard trigeminal neuralgia america సల్మాన్ ఖాన్ బాడీగార్డు టైజెమినల్ న్యూరాల్జియా అమెరికా


Click it and Unblock the Notifications