»   » బాహుబలి గురించి, సౌత్ ఫ్యాన్స్ ఉద్దేశించి... సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

బాహుబలి గురించి, సౌత్ ఫ్యాన్స్ ఉద్దేశించి... సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రభాస్ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' హిందీ చిత్ర పరిశ్రమలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేవలం హిందీలోనే రూ. 500 కోట్లు వసూలు చేసి బాలీవుడ్లో అందరికీ షాకిచ్చింది. ఒక నాన్ హిందీ ఫిల్మ్ ఇక్కడి పెద్ద పెద్ద స్టార్ల సినిమాలను సైతం పడగొట్టి నెం.1 స్థానంలో నిలవడం అంటే మామూలు విషయం కాదు.

ఇప్పటి వరకు బాలీవుడ్లో ఏదైనా రికార్డులు బద్దలు కొట్టాలంటే.... అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ మాత్రమే. ఇపుడు పక్క ఇండస్ట్రీ నుండి ప్రభాస్ వచ్చి బాలీవుడ్ బాక్సాఫీను షేక్ చేయడం హాట్ టాపిక్ అయింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'బాహుబలి-2' సినిమా గురించి, సౌత్ ఫ్యాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

బాహుబలి సక్సెస్‌కు కారణం అదే అని చెప్పిన సల్మాన్

బాహుబలి సక్సెస్‌కు కారణం అదే అని చెప్పిన సల్మాన్

ఒక బాలీవుడ్ మూవీ అంత పెద్ద నెంబర్స్ సాధించడం కష్టం. బాహుబలి సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి కారణం హిందీ ప్రేక్షకులు. వారు బాహుబలి సినిమాను స్వీకరించారు అని సల్మాన్ ఖాన్ తెలిపారు.

దక్షిణాది ప్రేక్షకలు మమ్మల్ని స్వీకరించడం లేదు

దక్షిణాది ప్రేక్షకలు మమ్మల్ని స్వీకరించడం లేదు

హిందీ ప్రేక్షకులకు తెలుగు సినిమా స్టార్లు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ పెద్దగా తెలియదు. ముక్కు మొహం తెలియని ప్రభాస్ లాంటి హీరో సినిమాను కూడా బాగా ఆదరించారు. దక్షిణాది ప్రేక్షకులకు మేము బాగా తెలుసు. కానీ మా సినిమాలు అక్కడ సరిగా ఆడవు. సౌత్ ప్రేక్షకులు వారి వారి హీరోల సినిమాలను తప్ప ఇతర స్టార్ల సినిమాలను పెద్దగా ఆదరించక పోవడమే కారణం అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్

బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్

సౌత్‌లో ఆయా స్టార్లకు చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక వేళ వారు కమల్ హాసన్ ఫ్యాన్స్ అయితే వారు ఎప్పటికీ కమల్ హాసన్ అభిమానిగానే ఉంటారు, రజనీకాంత్ అభిమాని అయితే జీవితాంతం రజనీకాంత్ అభిమానిగానే ఉంటారు... అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

హిందీ ప్రేక్షకులకు హాట్సాఫ్

హిందీ ప్రేక్షకులకు హాట్సాఫ్

ఈ సందర్భంగా నేను హిందీ ప్రేక్షకులకు హాట్సాఫ్ చెబుతున్నాను. వారు సినిమాను ప్రేమిస్తారు.... ఇంగ్లిష్, చైనీస్, సౌత్ ఫిల్మ్స్ ఇలా అన్నింటినీ ఆదరిస్తారు అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

అభిమానులను ఉద్దేశించి..

అభిమానులను ఉద్దేశించి..

‘ఇక్కడ సల్మాన్ ఖాన్ అభిమాని షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలు కూడా చూస్తారు.... సినిమా నచ్చితే అభినందిస్తారు' అని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇలా అనడం ద్వారా సౌత్‌లో అలాంటి పరిస్థితి లేదని చెప్పకనే చెప్పాడు సల్లూభాయ్.

కలెక్షన్లపై తన అభిప్రాయం

కలెక్షన్లపై తన అభిప్రాయం

కలెక్షన్ల లెక్కల గురించి సల్మాన్ ఖాన్ తన అభిప్రాయం వెల్లడించారు. నువ్వు సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నావంటే.... అది నీ సినిమా కలెక్షన్, ఇతరులకు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నారు.

ఒకరిని తొక్కేయాలని ఎవరూ చూడరు

ఒకరిని తొక్కేయాలని ఎవరూ చూడరు

నేను ఒక విషయాన్ని బాగా నమ్ముతాను. ఇక్కడ ఒకరు మరొకరిని తొక్కేయడానికి ప్రయత్నించరు. తనకు తాను ఎదిగేందుకు ప్రయత్నిస్తారు అని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.

అలాంటి వారు కొందరు ఉంటారు

అలాంటి వారు కొందరు ఉంటారు

ఒకసారి నువ్వు పైకొచ్చిన తర్వాత ఆ స్థాయికి రావడానికి ఇతరులు కూడా ప్రయత్నిస్తారు. కానీ కొందరు నెగెటివ్ పబ్లిసిటీ చేసి తొక్కేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటివి ఎవరూ చేయకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే అలాంటివేవీ నేను నా సీనియర్స్ నుండి నేర్చుకోలేదు అని సల్మాన్ ఖాన్ తెలిపారు.

English summary
Recently, in an interview with DNA, Salman took a sly dig at Prabhas' fans and revealed by it's difficult for Bollywood movies to achieve that number. "I will tell you why numbers have become such a big thing. The most amazing thing about Baahubali's success is that the Hindi audiences are so accepting."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu