నా సినిమాలు కూడా కొన్ని కుక్కలు చూడవని ఎప్పుడో చెప్పా
'గుజారిష్' సినిమాపై సల్మాన్ ఖాన్ ఆ మధ్య చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో దుమారం రేపాయి. ఈ విషయమై రీసెంట్ గా మీడియావారు ఆయన్ని ..మీరు చేసిన కామెంట్స్ హృతిక్, సంజయ్ లీలా బన్సాలీని బాధపెట్టాయి అని ప్రశ్నిస్తే...నా చిత్రాల విషయంలోనూ అనేక తప్పులు వెదుకుతుంటాను. విమర్శలు చేస్తుంటాను. ఖామోషీ, ఫిర్ మిలేంగే...చిత్రాలను కుక్కలు కూడా చూడవని కామెంట్ చేశా.
నన్నడిగితే...'గుజారిష్' లాంటి సినిమా చూసే సమయం ఇది కాదు. ఇక సందేశాల సంగతి అంటారా.. . సినిమాల ద్వారా సందేశాన్ని ఇవ్వటాన్ని నేనిష్టపడను. నిజానికి 'గుజారిష్'పై నేను అన్న కామెంట్ కన్నా ముందే, ఎన్నో విమర్శలు వచ్చాయ అన్నారు. ఇక 2010 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ చిత్రం సూపర్ హిట్ అయి కలెక్షన్స్ వర్షం కురిపిస్తే..గుజారిష్ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు తీవ్రమైన నష్టం కలిగించింది.
సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ హృతిక్ రోషన్ గుజారిష్ బ్లాక్ salman khan aishwarya rai hrithik roshan guzarish black


Click it and Unblock the Notifications