ఫ్యాన్స్‌కు ఆ హక్కులేదా? సల్మాన్ దురుసుతనంపై విమర్శలు

మరి ఆ అభిమాని ఏమైనా పెద్ద క్షమించరాని తప్పు చేసాడా? అంటే అలాంటి దేమీ లేదు. ఆసుపత్రి నుంచి తిరిగి వెలుతున్న సల్మాన్ ఖాన్‌ను కొందరు అభిమానులు అనుసరిస్తూ తమ మొబైల్ ఫోన్లో తమ ఫేవరెట్ హీరో సల్మాన్‌ను చిత్రీకరిస్తున్నారు. తన అనుమతి లేకుండా ఫోటోలు తీస్తారా అంటూ చిర్రెత్తిపోయాడు సల్మాన్.
కారు విండో తెరిచి ఓ అభిమాని చేతిలో నుంచి ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టాడు. మీడియా ముందు, పబ్లిక్ చూస్తుండగా సల్మాన్ ఇలా ప్రవర్తించడంతో అంతా విస్తు పోయారు. అభిమానుల ఆదరణ వల్లనే స్టార్ హీరోగా ఎదిగి కోట్లు సంపాదించిన సల్మాన్ ఖాన్ వారి పట్ల ఇలా ప్రవర్తించడం ఏమిటని అందరూ మండి పడుతున్నారు. రోడ్డుపైన వెలుతున్న హీరోను ఫోటోలు తీసుకునే హక్కు కూడా అభిమానులకు లేదా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











