»   » సల్మాన్‌కు కోర్టు షాక్ : హత్యానేరం కింద విచారణ

సల్మాన్‌కు కోర్టు షాక్ : హత్యానేరం కింద విచారణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ముంబై సెషన్స్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2002లో కారు డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి కారణమైన కేసులో సల్మాన్‌పై హత్యానేరం నిందార్హమైనదే అని కోర్టు సోమవారం(జూన్ 24)న అభిప్రాయ పడింది. విచారణ తీరును మార్చాలంటూ సల్మాన్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసి పుచ్చింది. కోర్టు ముందు హాజరయ్యేందుకు సల్మాన్‌కు నెల రోజుల గుడువు ఇచ్చింది.

తొలి నుంచీ విచారణ వివరాలు..
నిర్లక్ష్యంతో ఒకరి మరణానికి కారణమైనందున ఐపీసీ 304 ఏ సెక్షన్‌ కింద సల్మాన్‌ను తొలుత మేజిస్ట్రేట్‌ విచారించిన సెక్షన్‌ కింద అతనికి దాదాపు రెండేళ్లు శిక్ష పడే అవకాశం ఉండేదనే వాదోపవాదాలకు అవకాశమివ్వాలంటూ సల్మాన్‌ న్యాయవాది రాతపూర్వకంగా విన్నవించారు.

కానీ ఈ సంవత్సరం జనవరిలో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ 17 మంది సాక్షులను విచారించిన అనంతరం కేసు తీవ్రమైందిగా పరిగణించారు. శిక్షించదగిన హత్యా నేరమని (ఐపీసీ సెక్షన్ 304 పార్ట్-2) స్థానిక కోర్టు ఆరోపణలు మోపడాన్ని సవాల్ చేస్తూ సల్మాన్ సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

సల్మాన్ పిటీషన్‌ను ఈరోజు విచారించిన కోర్టు....అతని అభ్యర్థనను తోసి పుచ్చింది. తాజా పరిస్థితులను విశ్లేషిస్తే, అతను ఈ కేసులో దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28, 2002సంవత్సరంలో బాంద్రాలోని ఓ బేకరి ఎదుట నిద్రిస్తున్న జనాలపై సల్మాన్ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

English summary
Salman Khan is likely to face imprisonment for 10 years. A Mumbai session court on Monday, June 24 said that the actor would be tried for culpable homicide charge in connection with 2002 Hit and Run case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu