ఆర్య 2 రీమేక్ తో లవర్ బాయ్ గా కనిపించనన్ను స్టార్ హీరో...!
దక్షిణాది సినిమాల్ని హిందీలోకి రీమేక్ చేయడమే కర్తవ్యంగా పెట్టుకుని పని చేస్తున్న సల్మాన్ ఖాన్ త్వరలో మరో రీమేక్ లో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 చిత్రాన్ని రీమేక్ చేయడానికి సల్మాన్ సుముఖంగా ఉన్నట్టు భోగట్టా.
అల్లు అర్జున్-కాజల్, నవదీప్ ప్రదాన పాత్రల్లో నటించిన ఆర్య 2లో హీరో క్యారెక్టరైజేషన్, కొత్త తరహా స్క్రీన్ ప్లే సల్మాన్ కి బాగా నచ్చేశాయట. అందుకే ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం అప్పుడే మంతనాలు కూడా మొదలయ్యాయట. కాంచన, దూకుడు సినిమాలని రీమేక్ చేయాలని భావించిన సల్మాన్ ఆ తర్వాత ఆ ఆలోచన మానుకున్నాడు.
ప్రస్తుతం కిక్ రీమేక్ మాత్రమే చేస్తున్నాడు. రొటీన్ సినిమాలు చేస్తున్నాడనే కంప్లయింట్స్ వినిపిస్తూ ఉండడంతో సల్మాన్ ఈసారి పంథా మార్చి ఆర్య 2లాంటి కథని ఎంచుకున్నట్టున్నాడు. అయితే అతను ఏ సినిమా చేసినా కానీ ముందు దబాంగ్ సీక్వెల్ పూర్తి చేశాకే చేస్తాడంటున్నారు. ఒకవేళ ఆర్య 2 చేయడమంటూ జరిగితే సుకుమార్ దర్శకత్వంలోనే అది ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











