»   » సినిమా స్టోరీ నిజమైంది: గీతను కలవనున్న సల్మాన్ ఖాన్

సినిమా స్టోరీ నిజమైంది: గీతను కలవనున్న సల్మాన్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘బజరంగీ భాయిజాన్' సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే సినిమా స్టోరీని తలపించే రియల్ సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో మున్ని మాదిరిగా.... రియల్ లైఫ్ లో గీత అనే అమ్మాయి విషయం తెరపైకి వచ్చింది. సినిమాలో మున్నీ స్వస్థలం పాకిస్థాన్ కాగా ఇండియాలో తప్పిపోతుంది. అయితే రియల్ లైఫ్ గీత స్టోరీ ఇందుకు పూర్తి అపోజిట్ గా ఉంది. గీత భారత్ నుండి తప్పిపోయి పాకిస్థాన్ చేరింది.

భారత్ నుంచి తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన మూగ చెవిటి అమ్మాయి గీతను తన తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మద్దతు తెలిపాడు. తన సొంత తల్లిదండ్రులను కలుసుకోవాలని ఆమె కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందని అన్నాడు. స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత తనను కలవాలనుకుని గీత అనుకుంటే ఆమెను కలుస్తానని సల్మాన్ హామీ ఇచ్చాడు సల్మాన్. 15 ఏళ్ల పాటు పాకిస్థాన్ లో ఆమెకు ఆశ్రయం కల్పించిన స్వచ్ఛంద సంస్థకు థ్యాంక్స్ చెప్పాడు.

Salman Khan Turns Real-Life 'Bajrangi Bhaijaan' For Geeta In Pakistan

అయితే గీత తమ కూతురంటే తమ కూతురంటూ...ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మతో పాటు, పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన నాలుగు కుటుంబాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో గీత ఎవరి కూతురు? అనేది తేలాల్సి ఉంది.

English summary
Salman Khan Turns Real-Life 'Bajrangi Bhaijaan' For Geeta In Pakistan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu