For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోస్టర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేసాడు

  By Srikanya
  |

  ముంబై: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'స్టాలిన్‌' ఇప్పుడు హిందీలోకి సల్మాన్ హీరోగా 'జై హో' టైటిల్ తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 'జై హో' ప్రచారంలో భాగంగా ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మీడియాలో,ఇంటర్ నెట్ లో ఈ చిత్రం కబుర్లే. దానికి తోడు సల్మాన్ స్వయంగా చిత్రీకరించి మరీ విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

  'జై హో' టైటిల్‌తోపాటు 'ప్రజల మనిషి' అన్న ఉప శీర్షికతో ఉన్న ఈ వాల్‌ పోస్టర్‌పై కనిపించే సల్మాన్‌ రూపం కొన్ని వేల మంది సామాన్యుల ఆకారాలను కలిపితే ఏర్పడింది కావడం చెప్పుకోదగ్గ విషయం. సల్మాన్‌ ఖాన్‌ చేయి తిరిగిన చిత్రకారుడన్న విషయం తెలిసిందే. ఈ పోస్టరుకు కూడా ఆయనే స్వయంగా ఒక రూపమివ్వడం చెప్పుకోదగ్గ విషయం.

  Salman Khan unveils 'Jai Ho' first look

  తెలుగులో వచ్చిన స్టాలిన్‌ను ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించాడు. ఇది కూడా కెవిన్‌ స్పాసీ హాలీవుడ్‌ చిత్రం 'పే ఇట్‌ ఫార్వర్డ్‌'కు ప్రేరణగా అనిపిస్తుంది. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆయన తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ దర్శకత్వం వహించడంతో పాటు సునీల్‌ లుల్లాతో కలిసి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. మొదట ఈ చిత్రానికి 'మెంటల్‌' అని పేరు పెట్టినప్పటికీ దాన్ని ఇప్పుడు 'జై హో' గా మార్చారు.

  ఈ రోజుల్లో చలన చిత్రాలను కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించడమే కాకుండా ఆ చిత్రం ప్రజల్లోకి వెళ్ళడానికి మరిన్ని కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అంతే కాకుండా ఆ ప్రచారం కూడా ఎంతో వినూత్నంగా ఉండేలా నిర్మాతలే కాకుండా హీరోలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ చిత్రమంటే ప్రేక్షకుల్లో ఉత్కంఠ సహజం. అదీ కాకుండా 'ఏక్‌ థా టైగర్‌' తర్వాత ఒకటిన్నర సంవత్సరం సుదీర్ఘ వ్యవధిలో సల్మాన్‌ ఖాన్‌ చిత్రం విడుదల కావడంతో అందరూ ఎంతో ఆత్రంగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తన అభిమానులను నిరాశపరచకుండా సల్మాన్‌ ఖాన్‌ కూడా తన తదుపరి చిత్రం 'జై హో' ప్రచారంలో భాగంగా విడుదల చేసే ఫిల్మ్‌ పోస్టరులో అంతే ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు.

  దీని గురించి సల్మాన్‌ మాట్లాడుతూ ఇప్పటికే బాలీవుడ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్టుగా అమీర్‌ ఖాన్‌, బాద్షాగా షారూఖ్‌ ఖాన్‌తో పాటు సైఫ్‌ అలీ ఖాన్‌లు ఉన్నారని, తన చిత్రానికి మెంటల్‌ అని పేరుపెడితే తనను అందరూ 'మెంటల్‌ ఖాన్‌' అని పిలుస్తారని భయపడ్డానని చమత్కరించడం గమనార్హం. కానీ ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న పాత్ర పేరు 'జై' కావడంతో ఈ చిత్రానికి ఆ పేరు పెట్టామని సోహైల్‌ అంటున్నారు.

  ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా డైసీ షా కొత్తగా వెండితెరకు పరిచయమవుతోంది. ముఖ్య పాత్రల్లో సనా ఖాన్‌, టాబు నటిస్తున్నారు. అంతర్జాలంలో సందడి చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను గమనిస్తే సల్మాన్‌ సోదరి పాత్రలో టాబు నటిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే జనవరి 14న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ముంబయితో పాటు దుబాయ్‌, రొమానియాల్లో చిత్రీకరించారు. ఇటు ప్రసార మాధ్యమాలతో పాటు అటు అంతర్జాలంలోనూ హల్‌చల్‌ చేస్తోందీ ప్రచార చిత్రం.

  సల్మాన్‌ ఖాన్‌కు ట్విట్టర్‌లో ఐదు మిలియన్లు, ఫేస్‌బుక్‌లో పదకొండు మిలియన్ల మంది అభిమానులుండటం చెప్పుకోదగ్గ విషయం. మనకు ఎవరైనా సహాయం చేస్తే కేవలం కృతజ్ఞతతో సరిపెట్టకుండా మరి కొందరికి సహాయం చేసి ఆ విధంగా రుణం తీర్చుకోవాలన్న ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమా సల్మాన్‌ వ్యక్తిత్వానికి కూడా సరిపోతుంది. ఎందుకంటే సల్మాన్‌ ప్రాణంపోసిన స్వచ్ఛంద సంస్థ 'బీయింగ్‌ హ్యూమన్‌' ద్వారా ఆయన ఇప్పటికే పలు ప్రజాహిత కార్యక్రమాలను చేస్తున్నాడు కూడా.

  English summary
  Directed by brother Sohail Khan, 'Jai Ho' is the story of a man who fights against injustice. "I stand for justice every say. I consider myself as a common man as I do things, which a common man does in day-to-day life. Like I ride bicycle, rickshaw, I prefer taking fresh air while travelling in car, etc," said Salman Khan at the trailer launch.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X