»   » ఎక్స్ గర్ల్ ఫ్రెండుతో కలిసి ‘బాహుబలి’ చూసాడు (ఫోటోస్)

ఎక్స్ గర్ల్ ఫ్రెండుతో కలిసి ‘బాహుబలి’ చూసాడు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ బాలీవుడ్ సెలబ్రిటీలను సైతం ఆకర్షిస్తోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి ముంబైలో ‘బాహుబలి' సినిమా చూసాడు. వీరిలో సల్మాన్ ఖాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సంగీత బిజిలానీతో పాటు, మరికొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు.

సినిమా చూడటానికి ముందు నుండే సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘బాహుబలి సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తుండటం ఆనందంగా ఉంది' అని సల్మాన్ చెప్పుకొచ్చారు. ఆదివారం రాత్రి బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ రిసెప్షన్ ఉన్నప్పటికీ... సల్మాన్ ఖాన్ అటు వెళ్లకుండా ‘బాహుబలి' చూడటానికి వచ్చారు.


సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్


లైట్ బాక్స్ వద్ద వేసిన బాహుబలి స్పెషల్ స్క్రీనింగుకు హాజరైన సల్మాన్ ఖాన్.


సల్మాన్

సల్మాన్


బాహుబలి సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్... సల్మాన్ ఖాన్ ‘బజ్రింగి భాయిజ్ జాన్' చిత్రానికి కూడా కథ రాసారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది.


సంగీత బిజిలానీ

సంగీత బిజిలానీ


సల్మాన్ కాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సంగీత బిజిలానీ కూడా ఈ స్పెసల్ షోకు హాజరయ్యారు. ఇద్దరూ కలిసే వచ్చారు...కలిసే వెళ్లారు.


వరుణ్ ధావన్

వరుణ్ ధావన్


బాహుబలి సినిమా చూసిన అనంతరం వరుణ్ ధావన్ మాట్లాడుతూ... బాముబలి కేవలం సౌత్ సినిమా అచీవ్ మెంట్ కాదు...ఇండియన్ సినిమా అచీవ్ మెంట్ అని పేర్కొన్నాడు. ప్రతి ఫ్రేములోనూ డెడికేషన్ కనిపించింది అన్నారు.


డేవిడ్ ధావన్

డేవిడ్ ధావన్


సల్మాన్ ఖాన్ క్లోజ్ ప్రెండ్స్ లో ఒకరైన వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ కూడా ఈ స్పెషల్ షోకు హాజరయ్యారు.


డైసీ షా

డైసీ షా


జై హో మూవీ యాక్టర్ డైసీ షా కూడా సల్మాన్ తో కలిసి ఈ సినిమా చూసారు.


పులకిత్

పులకిత్


పులకిత్ సామ్రాట్ తన భార్యతో కలిసి ఈ స్పెషల్ షోకు హాజయ్యారు.


సూరజ్ పంచోలి

సూరజ్ పంచోలి


సల్మాన్ ఖాన్ తెరకెక్కిస్తున్న ‘హీరో' సినిమా ద్వారా సూరజ్ పంచోలి హీరోగా పరిచయం అవుతున్నారు.


ఎల్లి అరవమ్

ఎల్లి అరవమ్


సల్మాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరైన నటి ఎల్లి అరవమ్ కూడా హాజరయ్యారు.


స్నేహా ఉల్లాల్

స్నేహా ఉల్లాల్


సల్మాన్ ఖాన్ సోదరి అల్విరా, ఆమె భర్త అతుల్ అగ్నిహోత్రితో కలిసి స్నేహా ఉల్లాల్.తన గర్ల్ గ్యాంగ్ సంగీత బిజిలానీ(అతని మాజీ ప్రియురాలు), డైసీ షా, ఎల్లి అర్వమ్, స్నేహా ఉల్లాల్ లతో కలిసి సల్మాన్ ఖాన్ లైట్‌బాక్స్‌లో వేసిన ‘బాహుబలి' స్పెషల్ షో చూసారు. వీరితో పాటు వరుణ్ ధావన్, డేవిడ్ ధావన్, అల్విరా ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, పులకిత్ సామ్రాట్ అతని భార్యతో కలిసి, సూరజ్ పంచోలి తదితరులు ఈ సినిమా చూసారు.


‘బాహుబలి' సినిమా చూసిన తర్వాత సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ...‘బాహుబలి రైటర్ (విజయేంద్రప్రసాద్) బజ్రంగి భాయిజాన్ సినిమాకు కూడా కథ రాసారు. యాక్టర్ కావాలని రానాకు ఎప్పుడో చెప్పాను. ఇపుడు అతను రియలైజ్ అయ్యాడు. రానా దగ్గుబాటి ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్ చాలా క్లోజ్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనుకున్న రానాను యాక్టర్ కావాలని ప్రోత్సహించిన వారిలో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు.

English summary
Salman Khan whose movie Bajrangi Bhaijaan will release on 17th July was spotted watch Baahubali in Mumbai on Sunday night with his ex-girlfriend, a couple of other close friends and family.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu