ఫోటోలు: కమల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ‘విశ్వరూపం’ షో

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వివాదాస్పద 'విశ్వరూపం' చిత్రాన్ని ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత కమల్ హాసన్ తో కలిసి ముంబై బాంద్రాలో ఓ థియేటర్ల వీక్షించారు. వీరితో పాటు ప్రముఖ నటి రేఖ కూడా 'విశ్వరూపం' షోను చూసారు. ప్రత్యేకంగా వీరిద్దరి కోసమే ఫిబ్రవరి 1న రాత్రి 'విశ్వరూపం' ప్రత్చేక షో వేసారు.

బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం..... 'విశ్వరూపం' చిత్రం ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందనే ఆందోళన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ స్వయంగా కమల్ హాసన్‌ను తన కోసం షో వేయమని అడిగాట. సల్మాన్ కోరిక మేరకే దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన అనంతరం సల్మాన్ 'విశ్వరూపం' చిత్రానికి బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు.

తర్వత కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ... 'విశ్వరూపం' చిత్రాన్ని చూసి బాగుందని చెప్పారు. సినిమాను హాలీవుడ్ స్టాండర్స్ ప్రకారం తీసారని మెచ్చుకున్నారని వెల్లడించారు. ఈ స్పెషల్ షోకు సంబంధించిన కొన్ని ఎక్స్‌క్లూసివ్ ఫోటోలు క్రింది స్లైడ్ షోలో వీక్షించండి.

ఫోటోలు: కమల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ‘విశ్వరూపం’ షో

స్పెషల్ షో చూసిన తర్వాత కమల్ హాసన్ ‘విశ్వరూపం' చిత్రానికి మద్దతు ఇచ్చే స్టార్స్ లో సల్మాన్ ఖాన్ కూడా చేరారు.

ఫోటోలు: కమల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ‘విశ్వరూపం’ షో

స్పెషల్ షో వీక్షించిన అనంతరం కమల్ హసన్, సల్మాన్ ఖాన్, రేఖ మీడియాకు ఇలా ఫోజులిచ్చారు.

ఫోటోలు: కమల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ‘విశ్వరూపం’ షో

విశ్వరూపం చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవనడానికి.... సల్మాన్ ఖాన్ సపోర్టే నిదర్శనమని కమల్ హాసన్ అభిమానులు అంటున్నారు.

ఫోటోలు: కమల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ‘విశ్వరూపం’ షో

విశ్వరూపం చిత్రం ముస్లిం మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని పలు సంస్థలు ఆందోళన చేయడంతో తమిళనాడులో ఈచిత్రం విడుదల నిలిపి వేసిన సంగతి తెలిసిందే.

ఫోటోలు: కమల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ‘విశ్వరూపం’ షో

పట్టుదలకు పోతే సినిమా విడుదల లేటయి మరింత నష్టపోయే అవకాశం ఉండటంతో కమల్ హాసన్ రాజీకి వచ్చారు.

ఫోటోలు: కమల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ‘విశ్వరూపం’ షో

ముస్లిం సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి వారు అభ్యంతరం తెలుపుతున్న సీన్లను తొలగించడానికి అంగీకరించారు.

ఫోటోలు: కమల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ‘విశ్వరూపం’ షో

ఆ సీన్లు తొలగించడంతో ‘విశ్వరూపం' విడుదలకు మార్గం సుగమం అయింది.

ఫోటోలు: కమల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ ‘విశ్వరూపం’ షో

తమిలనాడులో ‘విశ్వరూపం' చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు.

విశ్వరూపం చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవనడానికి.... సల్మాన్ ఖాన్ సపోర్టే నిదర్శనమని కమల్ హాసన్ అభిమానులు అంటున్నారు. కమల్ హాసన్ తన 'విశ్వరూపం' చిత్రంలో ఎక్కడా కూడా మతపరమైన చర్చకు ఆస్కారం ఇవ్వలేదు. ఆప్ఘన్ లోని ఉగ్రవాద కార్యకలాపాలను మాత్రమే చూపకుండా... ఆప్ఘన్ ఉగ్రవాద కుటుంబాల్లోని స్త్రీలు, పిల్లల మానసిక స్థితిగతులు, ఆలోచనలపైనా దృష్టి సారించారు. ఇందులో ముస్లిం సంస్థలు ఆందోళన చేయడానికి కారణమేంటో తెలియడం లేదని కమల్ హాసన్ తో పాటు ఆయన అభిమానుల వాదన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X