'శిక్షార్హ హత్య' కింద సల్మాన్ విచారణ..తేలితే పదేళ్లు జైలు
కేసును తీవ్రంగా పరిగణిస్తూ ఈనెల 11న సెషన్స్ కోర్టు ముందు హాజరుకావాలంటూ సల్మాన్‌ను ఆదేశించింది. ఈ సెక్షన్ కింద హత్యతో సమానం కాని శిక్షార్హ నరహత్య అభియోగాలతో విచారిస్తారు. దీనికింద దోషిగా తేలితే గరిష్ఠంగా పదేళ్ల శిక్ష పడుతుంది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 304(2) (శిక్షించ దగిన హత్యా నేరం) కింద విచారణ జరపాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను మేజిస్ట్రేట్ కోర్టు అంగీకరించింది.
2002లో నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి, నలుగురు గాయపడటానికి కారణమైన సల్మాన్‌పై సెక్షన్ 304(1)(నిర్లక్ష్యపు డ్రైవింగ్) కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ సెక్షన్‌కింద గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే, సెక్షన్ 304(2) కింద పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ల మార్పు తో మేజిస్ట్రేట్ ఈ కేసును విచారణ నిమిత్తం సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. కాగా, ఫిబ్రవరి 11న సల్మాన్ సెషన్స్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని న్యాయవాది చెప్పారు.


Click it and Unblock the Notifications












