twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శిక్షార్హ హత్య' కింద సల్మాన్ విచారణ..తేలితే పదేళ్లు జైలు

    By Srikanya
    |

    ముంబయి: బాలీవుడ్‌ కండల వీరుడు కి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సల్మాన్‌ఖాన్‌ కారు దూసుకెళ్లడంతో ఒకరు మరణించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సల్మాన్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని 304(2) కింద విచారణ జరిగేలా చూడాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్థానిక మేజిస్ట్రేట్‌ కోర్టు గురువారం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులిచ్చింది.

    కేసును తీవ్రంగా పరిగణిస్తూ ఈనెల 11న సెషన్స్‌ కోర్టు ముందు హాజరుకావాలంటూ సల్మాన్‌ను ఆదేశించింది. ఈ సెక్షన్‌ కింద హత్యతో సమానం కాని శిక్షార్హ నరహత్య అభియోగాలతో విచారిస్తారు. దీనికింద దోషిగా తేలితే గరిష్ఠంగా పదేళ్ల శిక్ష పడుతుంది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 304(2) (శిక్షించ దగిన హత్యా నేరం) కింద విచారణ జరపాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను మేజిస్ట్రేట్ కోర్టు అంగీకరించింది.

    2002లో నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి, నలుగురు గాయపడటానికి కారణమైన సల్మాన్‌పై సెక్షన్ 304(1)(నిర్లక్ష్యపు డ్రైవింగ్) కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ సెక్షన్‌కింద గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే, సెక్షన్ 304(2) కింద పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ల మార్పు తో మేజిస్ట్రేట్ ఈ కేసును విచారణ నిమిత్తం సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. కాగా, ఫిబ్రవరి 11న సల్మాన్ సెషన్స్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని న్యాయవాది చెప్పారు.

    English summary
    In fresh trouble for Bollywood actor Salman Khan, the Bandra magistrate's court on Thursday accepted the prosecution's plea to enhance charges against the actor in the 11-year-old hit-and-run case, in which an allegedly drunk Khan rammed his Land Cruiser into a pavement, killing one person and injuring four.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X