'హిందూస్థానీ' పదం అవమానించారంటూ దర్శక, నిర్మాతలకు నోటీసులు
"మోస్ట్ వాంటెడ్ బ్యాచెలర్" గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ సొంత ప్రొడక్షన్ చిత్రం దబంగ్ లీగల్ వివాదంలో ఇరుక్కుంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా నిర్మాత అర్బజ్‌ఖాన్, దర్శకుడు అభినవ్ కాశ్యప్‌లకు స్థానిక సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. హిందూస్థానీ అనే పదాన్ని అవమానకర రీతిలో ఉపయోగించారనే ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు పైవిధంగా స్పందించింది. ఇక దబంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ అవినీతికి ఆలవాలమైన పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన ఆయన తమ్ముడు బార్య మలైకా అరోరా ఖాన్ ఒక ఐటమ్ సాంగ్ కి డ్యాన్స్ చేసింది. అదే హైలెట్ అవుతుందని తెలుస్తోంది. ఇఖ దర్సకుడు అభినవ్ కాశ్యప్...మరెవరో కాదు..ప్రముఖ దర్శకుడు అనురాగ కాశ్యప్ సోదరుడు. అలాగే ఈ చిత్రం ద్వారా నిన్నటి టాప్ స్టార్ శత్రుఘ్నసిన్హా ముద్దుల కూతురు సొనాక్షి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.


Click it and Unblock the Notifications











