»   »  రీమేక్ సాంగ్: జర్మన్ దౌత్యవేత్త‌తో కాంగ్రెస్ లీడర్ సల్మాన్ ఖుర్షీద్ (వీడియో)

రీమేక్ సాంగ్: జర్మన్ దౌత్యవేత్త‌తో కాంగ్రెస్ లీడర్ సల్మాన్ ఖుర్షీద్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ లీడర్, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ - భారత జర్మనీ దౌత్యవేత్త మైఖేల్ స్టీనర్ ఓ బాలీవుడ్ రీమేక్ పాటలో నటించారు. షారుక్ ఖాన్-సైఫ్ అలీ ఖాన్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘కల్ హో న హో'(2003) సాంగ్ రీమేక్ లో ఈ ఇద్దరూ కలిసి నటించారు.

జర్మనీ వెర్షన్ లో ఈ పాటను రీమేక్ చేసారు. "Lebe Zetzt-Kal Ho Naa Ho" అనే టైటిల్ తో రూపొందించిన ఈ సాంగులో జర్మీనీ దౌత్యవేత్త మైఖేల్ స్టెయినెర్ తన భార్య ఏలిస్‌తో కలిసి లీడ్ రోల్ లో నటించారు. షారుక్ ఖాన్ పాత్రలో మైఖేల్ స్టెయినర్ నటించగా, ప్రీతి జింతా పాత్రలో ఏలిస్ నటించారు. సైఫ్ అలీ కాన్ పోషించిన పాతలో స్లమాన్ ఖుర్షీద్ నటించారు. భారత్-జర్మనీ దౌత్య సంబంధాల నేపథ్యంలో ఈ సాంగును జర్మనీ వెర్షన్లో రీమేక్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

జర్మీనీ అంబాసిడర్ మైఖేల్ స్టీనర్, ఆయన భార్య ఏలిస్‌కు బాలీవుడ్ సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి దాదాపు 150 బాలీవుడ్ సినిమాలు చూసారట. ఆ ఇష్టంతోనే వారు ఈ బాలీవుడ్ రీమేక్ పాటలో నటించారు. ఈ పాటను స్వయంగా జర్మీనీ ఎంబసీ విడుదల చేయడం విశేషం.

 Salman Khurshid

ఈ పాటపై జర్మీనీ దౌత్యవేత్త మైఖేల్ స్టీనెర్ మాట్లాడుతూ...‘షారుక్, సైఫ్ జర్మీనీలో పాపులర్ యాక్టర్లు. నేను, నా వైఫ్ బాలీవుడ్ సినిమాలకు అడిక్ట్ అయ్యాం. ఇప్పటి వరకు 150కి పైగా బాలీవుడ్ సినిమాలు చూసాం. బాలీవుడ్ మీద రెస్పెక్ట్ తోనే ఈ సాంగ్ రీమేక్ చేసాం. నేను షారుక్ లా నటించలేక పోయానని రియలైజ్ అయ్యాను. బాలీవుడ్ అనేది కల్చరల్ ఇనిస్టిట్యూషన్' అని చెప్పుకొచ్చారు.

ఇండో-జర్మన్ సంబంధాలపై సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ...‘భారతీయ సంస్కృతి కూడా జర్మీనీ సంస్కృతి మూలాలు ఒకే విధంగా ఉంటాయి. అయితే జర్మనీ ప్రజల నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా క్రమ శిక్షణ విషయంలో వారి నుండి చాలా నేర్చుకోవాలి' అన్నారు.

ఈ రీమేక్ వీడియో మొత్తం ఇండియాలోనే చిత్రీకరించారు. ఈ వీడియో ప్రీమియర్ షోకు షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్, జావేద్ అక్తర్, మధు కిష్వార్, ఈ వీడియోను డైరెక్ట్ చేసిన సుమిత్ ఓస్మాండ్ షా హాజరయ్యారు.

English summary
Congress leader Salman Khurshid and German ambassador to India Michael Steiner made their acting debut recently with a remake video of Shah Rukh Khan-Saif Ali Khan-starrer 2003 romantic drama 'Kal Ho Naa Ho'.
Please Wait while comments are loading...