హిందీ గబ్బర్ సింగ్ 3 రెడీ అయిపోతోంది, గతం, భవిష్యత్తు ఇప్పుడు లేవు: సల్మాన్

తాజాగా ట్యూబ్ లైట్ తో ఫ్లాప్ ఎదురుకావటం తో కాస్త ఉలిక్కి పడ్డాడు సల్మాన్. మళ్ళీ ఒక సారి తన తరహా పాత్ర చేస్తే గానీ సెట్ అవదనుకున్నాడేమో "చుల్ బుల్ పాండేని మళ్ళీ తెచ్చే ప్రయత్నం లో ఉన్నాడు....

బాలీవుడ్ ఖాన్ త్ర‌యంలో ఒక‌డైన స్టార్‌ హీరో స‌ల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా అమీర్‌ ఖాన్‌తో అన్నివిధాలుగా పోటీప‌డుతూ దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.. కొంత‌కాలం క్రితం స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'దబాంగ్‌', 'దబాంగ్‌ 2′ చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి. తాజాగా ట్యూబ్ లైట్ తో ఫ్లాప్ ఎదురుకావటం తో కాస్త ఉలిక్కి పడ్డాడు సల్మాన్. మళ్ళీ ఒక సారి తన తరహా పాత్ర చేస్తే గానీ సెట్ అవదనుకున్నాడేమో "చుల్ బుల్ పాండేని మళ్ళీ తెచ్చే ప్రయత్నం లో ఉన్నాడు....

చుల్‌బుల్‌ పాండే

చుల్‌బుల్‌ పాండే

చాలా రోజులుగానే చర్చల్లో ఉన్న "దబంగ్ 3" ని తొందరగా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు... ‘చుల్‌బుల్‌ పాండే'గా మరోసారి అభిమానుల్ని అలరించడానికి సల్మాన్‌ ఖాన్‌ సిద్ధమవుతున్నాడు. 2010లో వచ్చిన ‘దబాంగ్‌' చిత్రం సల్మాన్‌ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచింది.

గబ్బర్‌సింగ్‌

గబ్బర్‌సింగ్‌

విభిన్నమైన పోలీస్‌ ఆఫీసర్‌గా ‘చుల్‌బుల్‌ పాండే' పాత్రలో సల్మాన్‌ నటన ప్రేక్షకుల్ని ఎంతో అలరించింది. ఈ చిత్రాన్నే పవన్‌కల్యాణ్‌ హీరోగా తెలుగులో ‘గబ్బర్‌సింగ్‌' పేరుతో రీమేక్‌ చేశారు. తెలుగులో కూడా ఆ సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత రెండేళ్లకు సీక్వెల్‌గా ‘దబాంగ్‌ 2' వచ్చింది.

దబాంగ్‌ 3 పేరుతో సీక్వెల్

దబాంగ్‌ 3 పేరుతో సీక్వెల్

ఆ సినిమా కూడా సక్సెస్‌ అయింది. అయితే తెలుగులో తీసిన గబ్బర్ సింగ్ 2 మాత్రం దరుణం గా పరాజయం పాలయ్యింది. ఐదేళ్ల అనంతరం ‘దబాంగ్‌ 3' పేరుతో సీక్వెల్‌ నిర్మించడానికి నిర్మాత, నటుడు అర్బాజ్‌ఖాన్‌ నిర్ణయించారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్‌కు వెళుతుందని ప్రకటించారు.

అవును..! దబాంగ్‌ 3 స్ర్కిప్ట్‌ రెడీ అయింది

అవును..! దబాంగ్‌ 3 స్ర్కిప్ట్‌ రెడీ అయింది

ఈ విషయాన్ని సల్మాన్‌ కూడా ధ్రువీకరించారు. ‘అవును..! దబాంగ్‌ 3 స్ర్కిప్ట్‌ రెడీ అయింది. అర్భాజ్‌ నిర్మించే ఈ చిత్రం షూటింగ్‌, అతుల్‌ అగ్నిహోత్రి (సల్మాన్‌ బావమరిది) నిర్మించే ‘భరత్‌' చిత్రం షూటింగ్స్‌ దాదాపు ఒకే సమయంలో జరుగుతాయుయి. అతుల్‌ నిర్మించే చిత్రం షూటింగ్‌ లో మధ్యమధ్య కొంత గ్యాప్‌ వస్తుంది.

మొదటి రెండు భాగాల్ని మించి

మొదటి రెండు భాగాల్ని మించి

ఆ గ్యాప్‌లో ‘దబాంగ్‌ 3' చేస్తాం. చుల్‌బుల్‌ పాండే గతం ఏమిటన్నది మొదటి, రెండు భాగాల్లో చూపించాం. మూడో భాగంలో అతని ప్రస్తుతం గురించి వివరిస్తాం' అని తెలిపారు. మొదటి రెండు భాగాల్ని మించి మూడో దబాంగ్‌ విజయం సాధిస్తుందేమో వేచి చూడాలి.

ప్రభుదేవా దర్శకత్వం

ప్రభుదేవా దర్శకత్వం

అయితే మొదటి రెండు భాగాలకు అర్భాజ్‌ దర్శకత్వం వహించగా, ఇప్పుడు మూడో పార్ట్‌కు మాత్రం ప్రభుదేవా ఆ బాధ్యతలు తీసుకోనున్నాడని కొన్నాళ్ళ కిందట అనుకున్నారు గానీ ఇప్పటికైతే ఆ విషయంలో క్లారిటీ ఏమీ లేదు.. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా, త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇందులో హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను సెలక్ట్‌ చేయబోతున్నారని టాక్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X