Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కిడ్నాప్ కేసు, అజ్ఞాతం వీడిన ‘మెంటల్’హీరోయిన్
మీడియాలో ఆమె పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని సనా ఖాన్ కొట్టి పారేసింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ సనా ఖాన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కిడ్నాప్‌కు ప్రయత్నించినట్లు తనపై వస్తున్న ఆరోపణలను తోసి పుచ్చింది.
తాను కిడ్నాప్‌కు ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్న 15 ఏళ్ల బాలిక తల్లి తనకు అభిమాని అని చెబుతోంది సనాఖాన్. ఆమె తనను కలవడానికి ప్రయత్నించిందని, తనను, తన కజిన్‌ను ఆహ్వానించడానికి కూతురును పంపిందని, ఐస్ క్రీం పార్లర్ లో వారిని కలసామని చెబుతోంది సనా ఖాన్.
సీసీటీవీ పుటేజుల్లో ఇవన్నీ రికార్డయి ఉంటుందని, తాను ఏ తప్పూ చేయలేదనడానికి ఆ సాక్ష్యాలు చాలని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది సనా ఖాన్. అయితే 'మెంటల్' మూవీ డైరెక్టర్ సొహైల్ ఖాన్ వాదన వేరేలా ఉంది. సనాఖాన్ షూటింగుకు హాజరు కాకపోవడం వల్ల చిత్రీకరణ నిలిచిపోయిందని చెబుతున్నాడు. మరి ఎవరికీ కనిపించకుండా సనా ఖాన్ ఎటు వెళ్లినట్లో?