సల్మాన్ లవర్‌కు ఇప్పటికే పెళ్లయిందా?
ముంబై : ఇటీవల సల్మాన్‌పై వినిపిస్తున్న ఏమిటంటే రొమేనియాకు చెందిన టీవీ నటి లులియా వేంటర్ తో సల్మాన్ లవ్ ఎపైర్ నడుపుతున్నాడని, ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడంటూ బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా లులియా పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
లూలియా వేంటర్ గతంలో గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన మ్యూజీషియన్ మారియస్ మోగాతో డేటింగ్ చేసిందని, ఇద్దరికి పెళ్లి కూడా అయిందని ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక పేర్కొంది. మారియస్ మోగా ఫేస్ బుక్ పేజీలో కూడా లూలియాతో పెళ్లయినట్లు ఆధారాలు ఉన్నాయట.
అయితే లూలియా-మోగా ప్రస్తుతం విడిపోయారని, ఆ తర్వాత ఆమె సల్మాన్ ఖాన్‌కు దగ్గయిందని, ఇద్దరూ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయినట్లు చర్చించుకుంటున్నారు. సల్మాన్‌కు పెళ్లి కాకపోయినా...చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేసాడనే పుకార్లు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
సల్మాన్, లులియా మధ్య 'సం'బంధం ఉన్నట్లు ఇటీవల హైదరాబాద్లో బలమైన ఆధారాలు లభించాయి. తన తాజా సినిమా 'మెంటల్' సినిమా షూటింగులో భాగంగా హైదరాబాద్‌లోని రాజమోజీ ఫిల్మ్ సిటీకి ప్రయాణం అయ్యాడు సల్మాన్. ఆయన వెంట ఎవరున్నారో తెలుసా...? ఇంకెవరు లులియా వేంటర్.
ఎయిర్ పోర్టులో మీడియా వారిని గమనించిన సల్మాన్ తన ప్రియురాలిని బాడీగార్డ్స్‌తో కలిసి హోటల్‌కి పంపించేసాడట. సల్మాన్ వెళ్లేందుకు వేరే కార్ బుక్ చేసారు. అదే సమయంలో ఎయిర్ పోర్టులోనే ఉన్న ఓ రాజకీయ నాయకుడు సల్మాన్‌ను తన కార్లో రావాలంటూ ఆహ్వానించడంతో మీడియాకు దొరకకుండా తుర్రుమన్నాడట ఈ కండల వీరుడు. ఏది ఏమైతేనేం సల్మాన్ ప్రస్తుతం లులియా వేంటర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉండి డేటింగ్ చేస్తున్నట్లు బట్టబయలైంది.


Click it and Unblock the Notifications












