సూపర్ ‘కిక్’: 11 రోజుల్లో 200 కోట్లు, టాప్ 5 ఇవే...
హైదరాబాద్: తెలుగులో సూపర్ హిట్ అయిన రవితేజ 'కిక్' చిత్రాన్ని బాలీవుడ్లో సల్మాన్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. సాజిద్ నడియావాలా ఈచిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. దర్శకుడిగా సాజిద్ నడియావాలాకు ఇదే తొలి సినిమా. సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించింది.
ఈద్ పండగను పురస్కరించుకుని విడుదలైన ఈచిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన రోజు హిట్ టాక్ రావడంతో నాలుగు రోజుల్లోనే ఈచిత్రం 100 కోట్ల వసూళ్లూ సాధించింది. తాజాగా ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్కును అధిగమించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం దాదాపు 5000 వేల థియేటర్లలో విడుదలైంది.
ఇప్పటి వరకు కిక్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 313 కోట్లు వసూలు చేసింది. అందులో ఇండియాలో రూ. 262 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 51 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల వివరాలు స్లైడ్ షోలో...

ధూమ్ 3
ధూమ్ 3 చిత్రం వరల్డ్ వైడ్ రూ. 537 కోట్లు వసూలు చేయగా, ఇండియాలో రూ. 280 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 165 కోట్లు రాబట్టింది.

చెన్నై ఎక్స్ ప్రెస్
చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 422 కోట్లు వసూలు చేయగా...ఇండియాలో రూ. 226.7 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 121 కోట్లు రాబట్టింది.

3 ఇడియట్స్
3 ఇడియట్స్ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 395 కోట్లు వసూలు చేయగా...ఇండియాలో రూ. 202 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 126 కోట్లు రాబట్టింది.

క్రిష్ 3
క్రిష్ 3 చిత్రం వరల్డ్ వైడ్ రూ. 374 కోట్లు వసూలు చేయగా, ఇండియాలో రూ. 240 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 54 కోట్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











