»   » సల్మాన్ రేప్ కామెంట్స్: బుద్దిలేదంటూ ఛీ కొట్టిన అమీర్ ఖాన్

సల్మాన్ రేప్ కామెంట్స్: బుద్దిలేదంటూ ఛీ కొట్టిన అమీర్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ ఇటీవల చేసిన రేప్ కామెంట్స్ దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా మహిళా సంఘాల నుండి నిరసన వ్యక్తం అయింది. పలువురు ప్రముఖులు సల్మాన్ తీరుపై మండి పడ్డారు. చివరకు సల్మాన్ తండ్రి కూడా అతన్ని ప్రవర్తనను ఛీ కొట్టాడు.

తాజాగా సల్మాన్ ఖాన్ తోటి నటుడు, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ విషయమై స్పందించారు. సల్మాన్ ఖాన్ ఈ కామెంట్స్ చేసినపుడు నేను వినలేదు. అయితే మీడియా ద్వారా ఈ విషయం నాకు తెలిసిందే. ఇది అనుకోకుండా జరిగిన సంఘటనో లేక మరేదో నాకు తెలియదు. ఇది నిజంగా బుద్దలేని ప్రవర్తన, సల్మాన్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అంటూ... సల్మాన్ ప్రవర్తనను అమీర్ ఖాన్ తప్పుబట్టారు.

తన తాజా సినిమా 'దంగల్' పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా అమీర్ ఖాన్ ను మీడియా వారు సల్మాన్ రేప్ కామెంట్స్ మీద ప్రశ్నించగా ఈ కామెంట్స్ చేసారు. అయితే ఈ సంఘటనపై మీరు సల్మాన్ ఖాన్ కు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా? అని ప్రశ్నించగా.... అడ్వైజ్ ఇవ్వడానికి నేనెవరిని? అంటూ అమీర్ ఖాన్ ఎదురు ప్రశ్నించారు.

Salman's Rape Comment Was Insensitive: Aamir Khan

సల్మాన్ ఖాన్ ఇటీవల తన 'సుల్తాన్' మూవీ గురించి మాట్లాడే సమయంలో.... షూటింగ్ పూర్తి చేసుకుని రోజూ ఇంటికెళ్లే సమయంలో నా పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉండేది అంటూ వ్యాఖ్యానించడం వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే.

సల్మాన్ కామెంట్స్ ను జాతీయ మహిళా కమీషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. సల్మాన్ ఖాన్ ఈ విషయంలో క్షమాపణ చెప్పాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. జులై 8న మహిళా కమీషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఆయన్ను ఆదేశించింది. సల్మాన్ ఖాన్ లాయర్ మాత్రం సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

English summary
Actor Aamir Khan has branded his colleague Salman Khan's rape comment as 'insensitive,' in what is possibly the first piece of unqualified condemnation of the controversial remark from a Bollywood A-lister.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu