»   » కోహ్లీ ఎఫెక్ట్...!?: అనుష్క తో ముద్దుకి నిరాకరించిన సల్మాన్

కోహ్లీ ఎఫెక్ట్...!?: అనుష్క తో ముద్దుకి నిరాకరించిన సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లిప్ లాక్ మన భారతీయ సినిమాలో ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యమూ,వివాదాస్పదమూ అయిన విషయం. ముద్దుల హీరో అనిపించుకున్న ఇమ్రాన్ హష్మీ లాంటి హీరోలు ముద్దుల్లో చాలా ముందున్నారు. మన దగ్గర తక్కువే గానీ బాలీవుడ్ లో లిప్ లాక్ అంటే మామూలైపోయింది.

బాలీవుడ్ వీరుడు అమీర్ ఖాన్ ముద్దు సీన్లకి ఎప్పుడో ఓకే చెప్పేసాడు. ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ విషయానికొస్తే "జబ్ తక్ హై జాన్" సినిమాలో లో కత్రినాకైఫ్‌తో లిప్ లాక్ చేసి తానూ ముద్దు పెట్టేయటానికి తగ్గనని నిరూపించుకున్నాడు.

sultan

అయితే ఇప్పటి వరకూ ముద్దు సీన్ చేయని హీరో ఒకరున్నారు. నిన్నా మొన్న వచ్చిన హీరో కాదు దాదాపు మూడు దశాబ్దాలుగా ఉన్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ . ఔను ఇప్పటి వరకూ సల్మాన్ తన సుధీర్ఘ కెరీర్ లో ఎప్పుడూ లిప్ లాక్ చేయలేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే బయటం మాత్రం సల్మాన్ కి చాలా ఎఫైర్లున్నాయి. తెర వెనక అయితే ఓకే నే కానీ తెర మీద మాత్రం ఇప్పటి వరకూ ముద్దంటే వద్దనే అన్నాడట సల్లూ భాయ్.

ఇప్పుడు సల్మాన్ ఖాన్ ముద్దుల విషయం ఎందుకొచ్చిందీ అంటే సల్మాన్ లేటెస్ట్‌గా చేస్తున్న "సుల్తాన్" సినిమాలో అనుష్క శర్మా తో లిప్ లాక్ సీన్ చేయాల్సి వచ్చిందట. కానీ నిష్కర్షగా అనుష్కని ముద్దాడేది లేదని చెప్పాదట ఈ బాలీవుడ్ బ్యాడ్ బాయ్.

అనుష్క శర్మతో ఓ ముద్దు సీన్ ఉండగా దర్శకుడు ఎంత చెప్పినా ఆ సీన్ చేయనంటే చేయనని చెప్పడంతో ఇకచేసేది లేక లిప్ లాక్ చేయకుండా పైపైన పెట్టే మూతి మీద ముద్దు తో అదీ తక్కువ సమయం లో ముగియాలని కండిషన్ పెట్టి మరీ ఒప్పుకున్నాడట.

నిన్నా మొన్నా వచ్చిన కుర్ర హీరోలూ, హీరోయిన్ లూ లిప్ లాక్ చేయటాని సై అంటూ ఎగబడుతూంటే, సల్మాన్ మాత్రం ఎందుకు ముద్దు సీనుకు వెనుకాడాడని దర్శకుడు తలబద్దలు కొట్టుకుంటున్నాడట. అనుష్క శర్మ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో క్రికెట్ మైదానాల్లో అనేక రకాలైన లిప్‌లాక్‌ కిస్‌లు పెట్టిన విషయం తెల్సిందే.

English summary
Salman was strictly no in doing Liplock with anushka sharma, The director force changed the script of "sulthan" for the sake of Salman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu