కలలో కూడా ఊహించలేదు: ఆ ముగ్గురు స్టార్స్ కలిసి సినిమా?

By Bojja Kumar

హైదరాబాద్: ఇండియన్ సినిమా చరిత్రలో ఇదో బిగ్గెస్ట్ న్యూస్. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ అభిమానులు కలలో కూడా ఊహించని న్యూస్ ఇది. బాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలుతున్న ఈ ముగ్గురు హీరోల మధ్య పోటీ వాతావరణం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఇపుడు ఈ ముగ్గురు ఖాన్స్ కలిసి సినిమా చేయబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా తెరకెక్కబోతోందని బాలీవుడ్ టాక్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా ఈ ముగ్గురు స్టార్లతో కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుతెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు ఇమేజ్ కి తగిన విధంగా పర్ ఫెక్ట్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

Salman, Shahrukh, Aamir together in one film!

సాజిద్ నడియావాలా స్వయంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారని.... 2017 జనవరిలో ఈ సినిమా ప్రారంభమై 2017 డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అన్ని పక్కా ప్లానింగుతో చేస్తున్నారట. సాజిద్ నడియావాలా స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారని అంటున్నారు.

గతంలో బాలీవుడ్లో వచ్చిన మన్మోహన్ దేశాయ్ మూవీ...‘అమర్ అక్బర్ ఆంటోనీ' తరహాలో ఈ చిత్రం ఉంటుందని టాక్. ఇప్పటి స్టాండర్డ్స్, ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి అద్దం పట్టేలా పూర్తి కమర్షియల్ సినిమాగా దీన్ని ప్లాన్ చేస్తున్నారట. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ముగ్గరు స్టార్ల మల్టీస్టారర్ మూవీ మరో మూడేళ్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వేళ సల్మాన్ ఖాన్ జైలుకెళితే మాత్రం ఈ సినిమా తెరకెక్కడం కష్టమే...అని మరికొందరు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X