'మగధీర' హిందీకి ఆ హీరో బెస్ట్...కాజల్
"మగధీర" ని హిందిలో రీమేక్ చేస్తే ఏ హీరోతో చేయాలి అని అందులో నటించిన హీరోయిన్ కాజల్ ని మీడియావారు అడగటం జరిగింది. దానికామె స్పందిస్తూ..చాలా మంది బాలీవుడ్ నటులకు ఆ పాత్ర చేయటానికి పొటిన్షియల్ ఉంది. మగధీర లో ఆ పాత్రకి చాలా హీరోయిజం, బాడీ లాంగ్వేజ్ అవసరం. నాకయితే సల్మాన్ అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అంది తెలివిగా. బాలీవుడ్ లో సెటిల్ కావటానికి సల్మాన్ ఖాన్ తో జోడి అయితే బెస్ట్ అనుకున్న ఆమె ఇలా అన్నదని ఇది విన్న వారంటున్నారు.అలాగే ఇంకా ఏ సౌత్ సినిమాలు హిందీ రీమేక్ కు పనికొస్తాయి అంటే తాను నటించిన అన్ని సౌత్ సినిమాలు రీమేక్ వ్యాల్యూ ఉన్నవని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications











