టాప్ హీరోకి టార్చర్ - ప్రత్యర్థితో మాజీ ప్రేయసి రొమాన్స్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య ఎలాంటి తీవ్రమైన పోటీ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక రకంగా వీరి ఇధ్దరి మధ్య సినిమాల పరంగా శతృత్వాన్ని తలపించే పోటీ ఉందని... ఎప్పుడు ప్రత్యర్థుల్లా కత్తులు దూసుకుంటారని టాక్. సల్మాన్‌తో గతంలో ఎఫైర్ కొనసాగించిన కత్రినా కైఫ్ షారుక్ మూలంగానే అతనికి దూరమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సల్లూ, కత్రినా కొంత కాలం దూరంగా ఉండటం, మళ్లీ స్నేహితులుగా మారి నటిస్తుండటం తెలిసిందే.

జబ్ తక్ హై జాన్ చిత్రంలో కత్రినా, షారుక్ లిప్ లాక్

షారుక్... కత్రినా మధ్య రొమాంటిక్ సీన్

‘సాస్' సాంగులోని ఓ రొమాంటిక్ స్టిల్

షారుక్ ఖాన్, కత్రినా బ్యూటిఫుల్ లుక్

పడకగది సన్నివేశంలో కత్రినా, షారుక్

షారుక్, కత్రినా హాట్ హాట్ సీన్
తాజాగా షారుక్ ఖాన్-కత్రినా కలిసి నటించిన 'జబ్ తక్ హై జాన్' చిత్రం ప్రీమియర్ షోకి సల్మాన్ ఖాన్ హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. తన ప్రత్యర్థిగా భావించే షారుక్ సినిమా ప్రీమియర్ షో చూడటానికి సల్మాన్ రావడం ఏమిటని అవాక్కయ్యారంతా. అందులోనూ తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో తన ప్రత్యర్థి రొమాన్స్ చేయడాన్ని గెస్ట్ గా వచ్చి చూసి సల్మాన్ ఎలా తట్టుకున్నాడో అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
యశ్ రాజ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన 'జబ్ తక్ హై జాన్' చిత్రంలో షారుక్-కత్రినా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఈ చిత్రంలో కత్రినా జ్యూసీ పెదాలను షారుక్ తన పెదాలతో ముద్దాడటం, హాట్ హాట్ పడక గది సన్నివేశాలు ఉన్నాయి. తన సినిమాల్లోకూడా చేయనంత హాట్ హాట్ సీన్లలో తన మాజీ ప్రేయసి తన ప్రత్యర్థితో చేయడం చూసి సల్మాన్ లోలోపల మదన పడి పోయాడని, పైకి మాత్రం అదేమీ తెలియనట్లు నటిస్తున్నాడని బాలీవుడ్ జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











