నా మొదటి సంబంధం సల్మాన్ తోనే: కత్రినా
కత్రినా కైఫ్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత కండల వీరుడు సల్మాన్ ఖాన్‌దే. స్వయంగా పరిచయం చేసి, ఆమెతోనే వరుస సినిమాలు చేయడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో 'సం'బంధం ఉందని అప్పట్లో బాలీవుడ్‌లో పుకార్లు వినింపించాయి కూడా. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం కొంత కాలంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉన్న విషయం కూడా తెలిసిందే. తనకు సల్మాన్‌తో స్నేహమే తప్ప, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు మరే ఇతర 'సం'బంధం లేదని కత్రినా అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది కూడా...
తాజాగా ఇద్దరి మధ్య విబేధాలు తొలగి పోయాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ జంట 'ఎక్తా టైగర్' అనే చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ.....బాలీవుడ్ లో సల్మాన్‌తోనే నా మొదటి సీరియస్ సంబంధం(రిలేషన్ షిప్) అని స్పష్టం చేసింది. నా సినీ కెరియర్‌కి మంచి బ్రేక్ ఇచ్చింది సల్మానే అని ఒప్పేసుకుంది. సల్మాన్ తో నటించిన సినిమా 'మైనే ప్యార్ క్యూన్ కియా' వల్లనే మంచి వచ్చింది. ఆ సినిమాద్వారానే నేను ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాను, మళ్లీ సల్మాన్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పకొచ్చింది ఈ సెక్సీ లేడీ.
ఇలా మాట్లాడుతున్నానని మళ్లీ మాకు ఎలాంటి లింకులు అంటగొట్టొద్దు, మేము ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నాం, ప్రేమకు స్నేహాని చాలా తేడా ఉంది. నేను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాను అంటూ ప్రకటన చేసి...మీడియాలో తనపై ఎలాంటి తప్పుడు ప్రచారం జరుగకుండా జాగ్రత్త పడింది కత్రినా.


Click it and Unblock the Notifications











