బన్ని 'రేసు గుర్రం' లో తన పాత్ర గురించి సలోని
హైదరాబాద్ సలోని మరోసారి వార్తల్లోకి వచ్చింది. 'మర్యాద రామన్న'లాంటి విజయాన్ని అవకాశాలుగా మలచుకోలేకపోయింది సలోని మరో అవకాసం చేజిక్కించుకుంది. అల్లు అర్జున్ - సురేందర్‌రెడ్డి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రుతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రానికి 'రేసు గుర్రం' అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్ కు అవకాసం ఉంది. అది సలోని ని వరించింది.
తన పాత్ర గురించి సలోని మాట్లాడుతూ.... ''ఈ సినిమాలో నా పాత్ర పూర్తిగా సంప్రదాయబద్ధంగా సాగుతుంది. ఎక్కువ భాగం చీరకట్టులోనే కనిపిస్తా. నటనకు అస్కారం ఉన్న పాత్ర దక్కడం నా అదృష్టం'' అని చెబుతోంది సలోని. మరి ఇలాంటి పాత్రలో ఈ 'తెలుగమ్మాయి' ఎలా ఒదిగిపోతుందో చూడాలి. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న 'తెలుగమ్మాయి' నిరాశపరిచింది. వెంకటేష్ సినిమా 'బాడీగార్డ్'లో నటించినా ఆమె పాత్రకు తగిన గుర్తింపు రాలేదు. సలోని కెరీర్ ఏమైపోతుందో అనుకొంటున్న దశలో ఈ అవకాశం ఆమె ముంగిట వాలింది.
ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్‌పై తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు అల్లు అర్జున్. ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ స్పందిస్తూ...'రేస్ గుర్రం చిత్రం కోసం తమన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఆడియో విడుదల ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాటలు సూపర్ హిట్టవడం ఖాయం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.కిక్ సినిమాతో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది.
నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications












