బ్రహ్మానందం నిర్మాతగా సలోని హీరోయిన్ గా...
'మర్యాద రామన్న'చిత్రంలో తెలుగు అమ్మాయి అంటూ ఉర్రూతలూగించిన సలోనికి మరో ఆఫర్ వచ్చింది. 'వీర' చిత్రం రూపొందించి హిట్టులలో ఉన్న రవితేజకు ప్లాఫ్ ఇచ్చిన దర్శకుడు రమేష్ వర్మ. ఆయన ఈ చిత్రం అనంతరం బ్రహ్మానందం రుమారుడు గౌతమ్ తో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అందులో హీరోయిన్‌గా సలోనిని తాజాగా ఎంపికచేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని బ్రహ్మానందం తన కుమారుడు కోసం నిర్మించనున్నారు. అయితే అదీ సీక్రెట్ గా చేస్తున్నారని,వేరే వారి పేరు పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
గతంలో రమేష్ వర్మ రూపొందించిన 'ఒక ఊరిలో...' సినిమాలో సలోని హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత ఆమెకు మర్యాద రామన్న చిత్రం దాకా బ్రేక్ రాలేదు. ప్రస్తుతం 'తెలుగమ్మాయి' సినిమాతో బాటు, బాలకృష్ణ, వెంకటేష్ చేస్తున్న చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది.ఇక ఈ కొత్త చిత్రానికి స్క్రిప్టు రెడీ అయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందిస్తానని చెప్తున్నారు. 'వీర'కు ముందు యంగ్ హీరోలు నాని, తనీష్ లను పెట్టుకుని రైడ్ అనే చిత్రం హిట్టు ఇచ్చి ఉండటంతో ఈ చిత్రం బాగానే తీస్తారని నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications











