కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది..సలోని
ఆయనకు నన్నో లాయర్‌గా చూడాలని ఉండేది. నాకేమో యాక్టింగ్‌పైనే మనసంతా. దాంతో చాలా కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది. మొదట్లో కోప్పడ్డారు కానీ ఇప్పుడు నన్నెంతో ప్రోత్సహిస్తున్నారు.మా నాన్నగారు కస్టమ్స్ ఆఫీసర్ అంటూ చెప్పుకొచ్చింది సలోని. రాజమౌళి 'మర్యాద రామన్న' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు 'తెలుగమ్మాయి', వెంకటేష్ తో బాడీగార్డ్, బాలకృష్ణ చిత్రంలోనూ చేస్తోంది. తెలుగుతో పాటు కన్నడంలో కూడా కొన్ని సినిమాలు చేస్తున్న ఆమె చాలా ఆశావాద దృక్పథంతో ఉంది. మన పనిని మనం చేస్తాం. హిట్..ఫ్లాప్ లు మన చేతుల్లో లేవు కదా అందామె.కెరీర్ ప్రారంభంలో ఆమె తరుణ్ సరసన ఒక ఊరిలో చిత్రంలో హీరోయిన్ గా చేసింది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందింన ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది.


Click it and Unblock the Notifications











