twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ లేడీ గెటప్ చూసి నవ్వాగలేదు

    By Srikanya
    |

    వెంకటేశ్ గొప్ప నటులు. ఎంతో సౌకర్యవంతమైన, అనుభవం ఉన్న సహ నటులు. ఆడ వేషంలో ఆయన్ని చూసి నాకు నవ్వాగలేదు అంటోంది సలోని. ఆమె వెంకటేష్ సరసన నటించిన బాడీగార్డ్ చిత్ర్రంలో వెంకటేష్ లేడీ గెటప్ వేసి నవ్విస్తారు. ఆ విషయం తలుచుకుంటూ ఆమె ఇలా స్పందించింది. అలాగే హిందీ 'బాడీగార్డ్' వచ్చి హిట్టయి కొద్ది రోజులే కావడంతో అదే కథతో తీసిన తెలుగు 'బాడీగార్డ్' కోసం జనం చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. హిందీ సినిమాకి సమానమైన స్పందన తెలుగు సినిమాకి వస్తోంది. దర్శకుడు ప్రతి పాత్రనూ చక్కగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో మాత్రం సంభాషణలు చాలా తక్కువ.

    దాదాపుగా ముఖకవళికల ద్వారానే భావాలు పలికించాను. ప్రేక్షకులు నా పాత్రని బాగా ఆదరించారు. దాంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. ఇకపై ఇలాంటి పాత్రలు ధైర్యంగా ఒప్పుకోగలను. ఇకపైన కూడా మంచి పాత్రల్లోనే కనిపిస్తా. చాలా కథలు వింటున్నా. త్వరలోనే కొత్త సినిమా కబురు చెబుతా. ఇక మా ఇంట్లోవాళ్లకి భాష తెలీకపోయినా బాగా ఎంజాయ్ చేశారు. ఇది నాకు బిగ్ బ్రేక్ ఫిల్మ్. ప్రేక్షకులు నా పాత్రను కూడా బాగా ప్రేమిస్తున్నారు. 'మర్యాద రామన్న', 'తెలుగమ్మాయి' చిత్రాల్లో వసపిట్టలా మాట్లాడిన నా చేత ఇందులో అండర్‌ప్లే చేయించాడు దర్శకుడు. మాటల కంటే హావభావాలు ఎక్కువగా ఉన్న ఈ పాత్రతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నందుకూ, పెద్ద హిట్‌తో ఈ సంవత్సరం ప్రారంభమైనందుకూ ఆనందంగా ఉంది అని చెప్పింది.

    English summary
    
 Saloni Says...In Body Guard..Venkatesh's lady getup is highlet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X