సలోనీ..మగధీరుడితో నూ
సలోనికి దశ తిరిగినట్లే కనపడుతోంది. ఆమె రామ్ చరణ్ తేజ తాజా చిత్రం మగధీరలోనూ ఐటం సాంగ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక తాజాగా రాజమౌళి, సునీల్ కాంబినేషన్లో ప్రారంభమైన మర్యాదరామన్న చిత్రంలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ఆద్యంతం కామిడీతో నడిచే ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఇక సలోని గతంలో ఒక ఊరిలో, ధన 51 చిత్రాలలో కనిపించి మరిపించిన సలోనీ ఆ తర్వాత అవకాశాలు లేక కనపడలేదు. అందం చలాకీతనం ఉన్న సలోనీ కెరీర్ ఈ చిత్రాలతోనైనా మలుపు తిరుగుతుందని అంతా భావిస్తున్నారు. రాజమౌళి సినిమాలో బుక్కయ్యాక కొంతమంది నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారని సమాచారం.
saloni item song rajamouli magadheera ramcharan kajal tarun sumanth rayalseema ఒక ఊరిలో ధన 51 రాజమౌళి సునీల్ కామిడీ రాయలసీమ ఫ్యాక్షన్ కెరీర్


Click it and Unblock the Notifications