ఆ హీరోయిన్ కి గాఢ్ ఫాదరైపోయిన రాజమౌళి...!
బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ రావడంతో సెక్సీ భామ సలోనీ ఎగిరి గంతేస్తోంది. ఇదంతా రాజమౌళికి కృతజ్ఝతలు చెప్పేసుకుంటోంది సలోనీ. 'మగధీర" సినిమాలో చిన్న పాత్ర కోసం రాజమౌళి తనను అప్రోచ్ కాకపోతే. ఇప్పుడు టాలీవుడ్ లో తాను కన్పించేదాన్ని కాననీ, తనకు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఘనంగా ఇచ్చిన రాజమౌళి జీవితాంతం రుణపడి వుంటానని సలోనీ చెబుతోంది.
ప్రస్తుతం సలోని 'తెలుగమ్మాయి" అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. బాలయ్యతో ఛాన్స్ రావడంతో, సలోని ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అవకాశాలు తనను ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాయనీ, కెరీర్ ఇలా దశ తిరుగుతుందని తానెప్పుడూ అనుకోలేదని సలోనీ ఎగిరి గంతేస్తోంది. మొత్తమ్మీద 'మర్యాదరామన్న" పేరు చెప్పి సలోనీకి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి సలోనీకి గాడ్ ఫాదర్ అయిపోయాడన్నమాట.
సలోని రాజమౌళి మగధీర మర్యాద రామన్న సునీల్ బాలకృష్ణ saloni rajamouli maryada ramanna magadheera sunil balakrishna


Click it and Unblock the Notifications