తృటిలో పెద్ద ప్రమాదం నుంచి... సలోని
గుర్రం మీద స్వారీ ఎప్పుడూ చేయలేదు. గుర్రం ఎక్కగానే అది ఒకటే పరుగు. అదుపు చేయడం కష్టమైంది. కింద పడిపోవాల్సింది. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొన్నాను అంటోంది సలోని. ఆమె తాజా చిత్రం 'తెలుగమ్మాయి' గురించి మాట్లుడుతూ ఇలా స్పందించింది. 'మర్యాద రామన్న' తర్వత చేసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయి చాలా కాలం జరిగినా ఇప్పటికి రిలిజ్ కాలేదు. ఆ విషయమై స్పందిస్తూ... 'మర్యాద రామన్న' తరవాత నా సినిమా ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అందుకే మీకు విరామం వచ్చినట్టు కనిపిస్తోంది. నేను మాత్రం ప్రతి రోజూ షూటింగ్ లతో తీరిక లేకుండా ఉన్నాను. 'తెలుగమ్మాయి'తో పాటు వెంకటేష్, బాలకృష్ణ సినిమాల్లో నటిస్తున్నాను. వీటితో పాటు ఓ కన్నడ సినిమా చేస్తున్నాను అంది.
ఇక 'తెలుగమ్మాయి' సినిమా గురించి చెప్పాలంటే అచ్చమైన తెలుగు సంప్రదాయానికి ప్రతిబింబంలా ఉంటుంది. పేరు చూసి ఇదేదో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనుకోవద్దు. తెలుగమ్మాయిలో నా పాత్ర పేరు బాలాత్రిపుర సుందరి. అభినయానికి ప్రాధాన్యమున్న పాత్ర. చాలా తెలివి తేటలు కలిగిన అమ్మాయి. కాలేజీలో చదువుకునే ఆమె అవసరమైతే ఎలా భద్రకాళిలా మారుతుందో చెప్పే కథ. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోడానికి కృషి చేసే పాత్ర. ఇందులో లంగా-ఓణీలో కనిపిస్తా. నాతోపాటు నలుగురు హీరోలు ఉంటారు. కథలో మలుపులు, వినోదం, మంచి పాటలూ... వీటితో పాటు చక్కని సందేశం అన్నీ ఉన్న సినిమా ఇది్ అంది.


Click it and Unblock the Notifications











