ఆ వార్తలు నమ్మొద్దు: దిల్ రాజు, సమంత
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నుంచి సమంతను తొలగించారని, ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో మహేష్ బాబు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నటు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలపై సమంత స్పందిస్తూ... 'ఎదుగుతున్న వారిపై గాలి వార్తలు రావడం సినీ పరిశ్రమలో సర్వ సాధారణమైపోయింది. ఈ మధ్య విజయాల బాటలో పయనిస్తున్న నాపై ప్రస్తుతం కొన్ని గాలి వార్తలు పుట్టు కొస్తున్నాయి. అలాంటి వార్తలు విన్నప్పుడు వాటిని చూసి తెగ నవ్వుకుంటాను' అంటోంది. డేట్స్ సర్ధుబాటు కావడంలేదని వస్తున్న వార్తలపై సమంత తనదైన శైలిలో స్పందిస్తూ ' దిల్ రాజు నిర్మించనున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నేను నటించడంలేదని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదు. ఈ చిత్రంలో నటించడానికి నాకు ఎలాంటి డేట్స్ సమస్యలు లేవు. త్వరలో షూటింగులో పాల్గొంటానని స్పష్టం చేసింది.
నిర్మాత దిల్ రాజు కూడా ఈ వార్తలను దృవీకరించారు. సమంతను తొలగించినపట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications











