twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాకు సమైక్య సెగ : మనకి మైనస్-వాళ్లకి ప్లస్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తామన్న ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. ఓ వైపు తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల కల నెరవేరినందుకు ఆనందంగా ఉంటే, విభజనను మొదటి నుండీ వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రజలు ఆందోళన బాట పట్టారు.

    ఊరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు సమైక్యవాద ఆందోళన కారులు ఇప్పుడు సినిమా పరిశ్రమను టార్గెట్ చేసారు. సినిమానుల అడ్డుకుంటాం అంటూ హెచ్చరికలు జారీ చేసారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోల సినిమాలను ఆడనివ్వం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

    దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'ఎవడు' సినిమాతో పాటు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాలు వాయిదా పడ్డాయి. సమైక్య ఉద్యమంతో నెలకొన్న ఈ పరిణామాలు తెలుగు సినీ పరిశ్రమకు కోట్లలో నష్ట పరిచే విధంగా తయారయ్యాయి.

    పరిశ్రమకు లాభనష్టాలకు కారణాలు స్లైడ్ షోలో....

    మనకు నష్టాలే

    మనకు నష్టాలే


    రెండు పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు విడుదల ఆగి పోవడంతో తెలుగు సినీ పరిశ్రమకు నష్టం‌గా పరిణమించింది. ఈ రెండు సినిమాల కోసం ఎప్పటి నుండో డేట్స్, థియేటర్స్ అడ్జెస్ట్ చేసి ప్రణాళికలు తయారు చేసారు. అయితే ఈ చిత్రాల విడుదల ఆగిపోవడంతో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది.

    వాళ్లకి లాభమే

    వాళ్లకి లాభమే


    ఈ పరిణామాలు తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద మైనస్‌గా మారితే.....ఇతర బాషా చిత్రాలకు మాత్రం వరంగా మారాయి. ఆగస్టు నెలలో ఏపీలో విడుదలకు సిద్ధమైన పలు తమిళ సిమాలు, హిందీ సినిమాలకు పెద్దగా పోటీ లేకుండా అయిపోయింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తమకు కలిసొస్తాయని ఆయా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

    ఇతర చిత్రాలపైనా ప్రభావం

    ఇతర చిత్రాలపైనా ప్రభావం


    ఈ రెండు చిత్రాల విడుదల లేట్ కావడంతో భవిష్యత్‌లో విడుదలయ్యే సినిమాలపై కూడా వీటి ప్రభావం పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. దీని వల్ల ఇటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, టోటల్‌గా పరిశ్రమకు నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.

    వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన

    వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన


    సినిమా పరిశ్రమలో దాదాపుగా సినిమాలన్నీ ఫైన్సాన్స్ వ్యవస్థపై ఆధార పడి తెరకెక్కుతుంటాయి. విడుదల ఆలస్యం అయిన కొద్దీ అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు పలువురు నిర్మాతలు.

    అందరు హీరోలపై ప్రభావం

    అందరు హీరోలపై ప్రభావం


    పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్ నటించిన రెండు పెద్ద సినిమాల విడుదల ఆగి పోవడం వల్ల ఈ సంవత్సరం విడుదలయ్యే మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, వెంకటేష్, రామ్ సినిమాలపై ప్రభావం పడుతుందని, వాటి విడుదల కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

    దాదాపు 250 కోట్ల వ్యాపారం అయోమయంలో

    దాదాపు 250 కోట్ల వ్యాపారం అయోమయంలో


    ఎవడు, అత్తారింటికి దారేది చిత్రాలతో పాటు ఈ సంవత్సరాంతం వరకు విడుదల సిద్ధమైన మరికొన్ని పెద్ద సినిమాలన్నీ కలిసి 250 కోట్ల పైచిలుకు విలువ చేస్తాయని అంచనా. సమైక్య ఉద్యమం పరిణామాలు వందల కోట్ల తెలుగు సినీ పరిశ్రమ వ్యాపారాన్ని అయోమయంలో నెట్టాయని చెప్పక తప్పదు.

    అప్పట్లో తెలంగాణ ఉద్యమం కూడా...

    అప్పట్లో తెలంగాణ ఉద్యమం కూడా...


    అప్పట్లో తెలంగాణ ఉద్యమం సందర్బంగా కొందరు ఆందోళన కారులు సినిమాలను అడ్డుకున్నారు. దీంతో పలు సినిమాలు చాలా నష్టపోయాయి. కొన్ని సినిమాల పరిస్థితి అయితే అప్పట్లో మరీ దారుణంగా తయారైంది.

    English summary
    Owing to the Samaikyandhra supporters' agitation in Andhra Pradesh, Pawan Kalyan's highly-anticipated Telugu film Attarintiki Daredi, which was to release on August 9, has now been pushed to a further date. The film was to lock horns with Vijay's Thalaivaa and Shahrukh Khan's Chennai Express at the Box Office, but now, Seemandhra agitation has forced its producers to delay the release of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X