నాగ చైతన్య, సమంత మ్యారేజ్ గెట్ టుగెదర్ పార్టీ (ఫోటోస్)
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ గెట్ టుగెదర్ పార్టీ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది.
Recommended Video

నాగ చైతన్య, సమంత వివాహం గత నెల గోవాలో గ్రాండ్‍గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత చై, సామ్ ఇద్దరూ తమ తమ సినిమా షూటింగులతో బిజీ అయిపోయారు. వీళ్ల బిజి షెడ్యూల్ కారణంగా వెడ్డింగ్ రిసెప్షన్ కూడా వాయిదా పడుతూ వస్తోంది.
షూటింగ్ గ్యాప్‌లో ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అవుతున్నారు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ తరుపున నిర్వహించిన గెట్ టుగెదర్ పార్టీలో చైతన్య, సమంతతో పాటు దగ్గుబాటి స్టార్స్, కుటుంబ సభ్యులు సందడి చేశారు.

తల్లితో కలిసి నాగ చైతన్య
తన కుమారుడి వివాహం అయిన తర్వాత తన ఫ్యామిలీ తరుపున అందరికీ పార్టీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే చైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ గెట్ టుగెదర్ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

పెళ్లి తర్వాత జరిగిన తొలిపార్టీ
నాగచైతన్య, సమంతల పెళ్లి తర్వాత జరిగిన తొలి గెట్ టుగెదర్ పార్టీ ఇదే. నూతన వధూవరులతోపాటు వెంకటేశ్, రానా, లక్ష్మి తదితర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే నాగార్జున, అమల ఉన్న ఫోటోలు మాత్రం కనిపించలేదు.

రానా సోదరి మాళవికతో
గెట్ టుగెదర్ పార్టీలో రానా సోదరి మాళవికతో కలిసి సమంత. రానా సోదరి మాళవిక వివాహం 2012 డిసెంబర్లో భరత్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతతో జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న పాప మాళవిక కుమార్తె.

సెల్పీల సందడి
ఈ మ్యారేజ్ గెట్ టుగెదర్ పార్టీలో రానా సందడి చేశారు. కుటుంబ సభ్యులతో సెల్పీలు దిగుతూ హడావుడిగా కనిపించారు.

సురేష్ బాబు
నాగ చైతన్య, సమంత మ్యారేజ్ గెట్ టుగెదర్ పార్టీలో నూతన వధూవరులను ఉద్దేశించి మాట్లాడుతున్న చైతన్య మేనమామ, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు.

వెంకీ సందడి
నాగ చైతన్య, సమంత మ్యారేజ్ గెట్ టుగెదర్ పార్టీలో వెంకటేష్ సందడి.

సోదరితో రానా
నాగ చైతన్య, సమంత మ్యారేజ్ గెట్ టుగెదర్ పార్టీలో సోదరి మాళవికతో కలిసి రానా.


Click it and Unblock the Notifications











