సర్వైకల్ క్యాన్సర్ టీకా వేయించుకున్న సమంత
చెన్నై: ఇటీవల పలువురు సెలబ్రిటీలు సర్వైకల్ కేన్సర్(గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ ) బారిన పడిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మనీషా కొయిరాలాతో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ వ్యాధికి గురయ్యారు. అమెరికాలో చికిత్స చేయించుకుని సురక్షితంగా ఆ వ్యాధి నుంచి బయట పడ్డారు.
సర్వైకల్ కేన్సర్ ప్రస్తుతం భారత్‌లో సర్వధారణం అయిపోయింది. అదే సమయంలో ఇది ప్రమాదకరమైది కూడా. ఏటా ఈ వ్యాధి కారణంగా దేశంలో వేలాది మంది మహిళలు చనిపోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధిపై దేశ వ్యాప్తంగా చైతన్యం కల్పిస్తూ... దాన్ని నిరోధించడానికి టీకాలు వేసే కార్యక్రమం కూడా చేపడుతున్నారు.
హీరోయిన్ సమంత సర్వైకల్ క్యాన్సర్ టీకా మహిళలందరూ వేయించుకునేలా వారిలో చైతన్యం తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ టీకా(వాక్సిన్) వేయించుకున్న సమంత....తాజాగా చివరి డోసు కూడా వేయించుకుంది. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
'సర్వైకల్ క్యాన్సర్ వేక్సిన్ చివరి డోసు కూడా వేయించుకున్నాను. అమ్మాయిలందరూ ఈ వ్యాక్సిన్ తప్పని సరిగా వేయించుకోవాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఈ వ్యాక్సిన్ విషయమై అవగాహన కల్పించండి' అని ట్వీట్ చేసింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఈ వాక్సినేషన్ వేయించుకోవడం వల్ల...... సర్వైకల్ కేన్సర్ పై జనాల్లో అవగాహన త్వరగా చొచ్చుకెలుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












