ఇప్పుడు దృష్టంతా ‘ఈగ’ మీదే
ప్రస్తుతం నా ధ్యాసంతా 'ఈగ' పైనే ఉంది. ప్రస్తుతం నేను నా గత విజయాలను మరచిపోయే పనిలో ఉన్నాను. అంటోంది సమంత. ఆమెను మీరే కదా ఇప్పుడు నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నది అని అడిగితే ఇలా సమాధానమిచ్చింది. అలాగే..మన గొప్పతనం మనకు ఎప్పుడు తెలిసిందో... అప్పట్నుంచే మన పతనం మొదలవుతుంది. సక్సెస్ వచ్చాక ఆ కిక్‌ని వెంటనే దించేసుకోవాలి. డౌన్ టూ ఎర్త్ అయ్యాక మళ్లీ కొత్త సినిమా గురించి ఆలోచించాలి. అప్పుడే చేసే ప్రతి సినిమాకూ తొలి సినిమాకు చేసినంత శ్రద్ధతో చేయగలం. ఏ రంగంలోనైనా మన గురించి మనం తెలుసుకోవాలి తప్ప మన గొప్పతనం గురించి మాత్రం తెలుసుకోకూడదు అంటోంది.
అలాగే సమంత తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ...రాజమౌళి ఈగ,గౌతమ్ మీనన్ తో చేస్తున్న సినిమాలు రెండూ తమిళ,తెలుగులో ఒకేసారి విడుదల అవుతాయి. రెండింటిలోనూ నానినే హీరో. అలాగే సిద్దార్ధ,నాగచైతన్య,మహేష్ బాబు సరసన ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయ్యాయని వినపడుతోంది అంటే...ఫస్ట్ డే షూట్ అయితే కానీ నేను ఏ సినిమానూ నా చేతిలో ఉందని చెప్పలేను అంది. నాకు అటువంటి కొన్ని నమ్మకాలు ఉన్నాయని తెలివిగా సమాధానం చెప్పింది.
ఇక ప్రస్తుతం సమంత డైరీ ఫుల్ గా ఉంది. ఆమె గౌతమ్ మీనన్ మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ లోనూ చేస్తోంది. అంతేగాక నాగచైతన్య సరసన ఆటోనగర్ సూర్యలోనూ, మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











