మహేష్ బాబును జీవితంలో ఒక్కసారైనా ...సమంతా
మహేష్ బాబును జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకున్నాను. తీరా ఆయనతో నటించే అవకాశం వచ్చేసరికి నమ్మలేకపోయాను" అంటూ ఆ క్షణాల్ని గుర్తుచేసుకుంది సమంత. నాగచైతన్య హీరోగా చేసిన 'ఏ మాయ చేసావె' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆమెకు మహేష్ సరసన ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈచిత్రం రూపొందనుంది. ఈ ఆఫర్ వచ్చిన విధానం గురించి చెబుతూ..."మహేష్ అంటే ఎంతిష్టమో మంజులకి చాలాసార్లు చెప్పాను. ఇందిర ప్రొడక్షన్స్ ఆఫీసులో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం. అప్పుడే 'మహేష్ తో సినిమా చేస్తావా...?' అని అడిగారు. వాళ్లందరూ కలిసి ఆటపట్టిస్తున్నారని అనుకున్నా. తీరా సంతకం పెట్టమనేసరికి నమ్మలేకపోయాను. స్పృహ తప్పినంత పనైంది. నా పరిస్థితి చూసి నీళ్లు తాగించారు. అప్పుడుగానీ నేను స్థిమితపడలేదు..అదంతా కలగా ఉంది" అంది సమంత. సమంత ఎన్టీఆర్ సరసన బృందావనంలోనూ, దశరధ్, ప్రభాస్ కాంబినేషన్ చిత్రంలోనూ, సిద్దార్ధతో యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందే తమిళ, తెలుగు చిత్రంలోనూ కమిటైంది.


Click it and Unblock the Notifications











