నిజ జీవితంలో తన ప్రేమ గురించి...సమంత
'ఏ మాయ చేసావె' చిత్రంతో పరిచయమైన 'కుందనబొమ్మ' సమంత ఆ చిత్రంలో జెస్సీ పాత్రలో ప్రేమ సన్నివేశాల్లో హృద్యంగా పండించింది. మరి ఇంతబాగా ప్రేమను పండించిన ఆమె నిజజీవితంలో ప్రేమకున్న ప్రాధాన్యత ఏమిటీ అంటే...ఎంత చెప్పినా కొత్తగా అనిపించేదే ప్రేమ. చిన్నప్పటి నుంచి ఎంతో మంది ప్రేమను రుచి చూసిన మనసు యవ్వనంలో సరిజోడు కోసం కొత్తగా ప్రేమలో పడుతుంది. అదే వింత. ఆ వింతను ఇప్పటి దాకా కెమెరా ముందు మాత్రమే చూశాను. నిజ జీవితంలో ఇంకా ప్రేమలో పడలేదు. పడే సందర్భం వస్తే మాత్రం అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను..ఆ ప్రేమను అందించగల మగాడు కనపడితే వదలను'' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది సమంత. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'బృందావనం' చిత్రంలో చేస్తున్న సమంత... తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేయబోతోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం వచ్చే నెలలో మొదలవుతుంది.
సమంత ఏ మాయ చేసావే ఎన్టీఆర్ బృందావనం నాగచైతన్య మహేష్ బాబు శ్రీను వైట్ల జెస్సీ త్రిష లవ్ samantha ye maya chesave jr ntr brundavanam naga chaitanya mahesh babu srinu vytla jessy love s


Click it and Unblock the Notifications