For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్యలపై సమంత కామెంట్స్

  By Srikanya
  |

  హైదరాబాద్: తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరూ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు సమంత. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న సమంతకు కెరీర్ ప్రారంభంలోనే పెద్ద పెద్ద హీరోల తో పనిచేసే అవకాసం వెతుక్కుంటూ వచ్చింది. తమిళంలో ఆమె చేసిన తొలి చిత్రం వర్కవుట్ కాకపోయినా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆమె చేసిన తెలుగు చిత్రం ఆమెను ఓ రేంజికి తీసుకు వెళ్లిపోయింది.

  వరస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న సమంతకు ఆ మధ్యన హెల్త్ పరంగా సమస్యలు వచ్చినా నిర్మాతలు ఎవరూ మరో ఆల్టర్ నేటివ్ గురించి చూడక ఆమె డేట్స్ కోసమే నిరీక్షించారు అంటేనే ఆమె క్రేజ్ అర్దమవుతోంది. ఆమె సినిమాలో నటించిందంటే డిస్ట్రిబ్యూటర్స్ చిత్రం కొనుగోలు చేయటానికి ముందుకు రావటం జరుగుతోంది.

  అంతేగాక ఆమెతో చేసిన హీరోలు మరోసారి చేయటానకి ఇంట్రస్ట్ చూపెడుతున్నారు. దర్శక, నిర్మాతలు సైతం ఎలాగైనా ఆమెను తమ తదుపరి చిత్రంలో ఉండేలా చూసుకుంటున్నారు. ఆమెను పెట్టుకునే సగం సక్సెస్ వచ్చినట్లే అని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు తనతో పనిచేసిన హీరోలపై ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నాయన్నది ఆసక్తికరం...

  నాగచైతన్య: తొలిసారిగా.. నాగచైతన్యతో ఏమి మాయ చేసావే చిత్రంలో చేసింది. ఇప్పుడు మరోసారి ఆటోనగర్ సూర్యలో నటించింది.

  సమంత మాట్లాడుతూ.. నాగచైతన్య - ఇండస్ట్రీలో నాకు మొదటినుంచి ఉన్న ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ తనే! ఇప్పుడు నేను తనతో ఇంకో సినిమా కూడా చేయబోతున్నాను... ఎదురుచూస్తున్నాను!

  జూనియర్ ఎన్టీఆర్ - వీరిద్దరూ కాంబినేషన్ లో బృందావనం చిత్రం వచ్చింది. ఇప్పుడు మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రంలోనూ ఆమెనే ఎంపిక చేసారు.

  ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తనకున్న టాలెంట్, తనలోని ఎనర్జీ, తను డైలాగ్‌లు చెప్పే తీరు నేనింతవరకు ఎవ్వరిలోనూ చూడలేదు... ఇకముందు చూస్తానని కూడా అనుకోను. అతనితోపాటు సేమ్ ఫ్రేమ్‌లో నించోవడం... అసాధ్యం! తన సినిమా సంగతి వదిలేయండి... తన సినిమా మేకింగ్ విడియో బయటకు రిలీజ్ చేసినా, అది సినిమా కంటే పెద్ద హిట్ అవుతుంది!

  మహేష్ - ‘దూకుడు' సినిమా మొదటిరోజున తను నాతో - ‘ప్రతి సినిమాని మొదటి సినిమా అనుకుని చెయ్యి' అన్నాడు. థ్యాంక్స్ టు హిమ్... అదే నేను ఇప్పటికీ, ఎప్పటికీ ఫాలో అయ్యే మంత్ర!

  నానీ: తనను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు తను ఈ స్థాయిలో ఉన్నాడంటే అది కేవలం తన స్వయంకృషి వల్లే! సినిమా పట్ల తనకున్న పాషన్, తనకున్న దూకుడుతనం తనని ఎంతోదూరం తీసుకెళ్తుందని నాకు గొప్ప నమ్మకం!

  సిద్దార్ధ: నందినీ రెడ్డి సినిమా షూటింగ్ మొదలయ్యే వరకూ ఎప్పుడూ అనుకోలేదు... తను ఈరోజున నాకు ఇంత క్లోజ్ అవుతాడని! నేను తనతోనే కాదు, వాళ్ల అమ్మతో, నాన్నతో, చెల్లితో కూడా చాలా క్లోజ్! అంతటి స్వీట్ ఫ్యామిలీని ఇప్పటిదాకా చూడలేదు. ఇక సిద్దార్ధ గురించి చెప్పాలంటే - తనంత తెలివైనవాణ్ణి, ప్రపంచంలో ఎన్నో విషయాల పట్ల అంతటి అవగాహన ఉన్నవాణ్ణి చూడలేదు.

  English summary
  Samantha express her views on Ntr, Mahesh, Siddharth etc. She is busy with many projects in Tollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X