మహేష్ ని చూస్తే ఓ విధమైన భయం

By Srikanya

హైదరాబాద్ : 'దూకుడు' టైమ్‌లో మహేష్ సార్‌ని చూస్తే ఓ విధమైన భయం. అమ్మో... 'సూపర్‌స్టార్' జాగ్రత్తగా ఉండాలి. అనుకుంటూ చేశాను. కానీ 'సీతమ్మవాకిట్లో...' విషయానికొచ్చేసరికి ఆ ఫీలింగ్ పోయింది. ధైర్యంగా చేసేశాను. ఆయన కూడా ఎలాంటి భేషజాలూ లేకుండా పాత్రకు తగ్గట్టుగానే సెట్‌లో బిహేవ్ చేసేవారు అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె మహేష్‌బాబుతో జతకట్టిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం సంక్రాంతికి విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సమంత మీడియావారితో ప్రత్యేకంగా మాట్లాడింది.

అలాగే మహేష్.. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా క్యూట్‌గా ఉంటాయ్. దానికితోడు సెట్‌లో చాలా సరదాగా ఉండేవారాయన. 'దూకుడు' టైమ్‌లో మహేష్ సార్ నాతో ఓ మాట అన్నారు. 'మనం చేసే ప్రతి సినిమానూ తొలి సినిమాగా భావించి పనిచేయాలి. అప్పుడే పాత్రకు వందశాతం న్యాయం చేయగలం' అని. నటిగా కొనసాగినంతకాలం ఈ మాటను మరిచిపోను అంది.

'సీతమ్మవాకిట్లో...' గురించి చెపుతూ.... ''దర్శకుడు కథ చెప్పిన ఐదు నిమిషాలకే అంగీకరించాను. భద్రాచలం సీతారాముల కల్యాణం సన్నివేశంలో ప్రకాష్‌రాజ్‌ పలికించిన భావోద్వేగాలు నేను మర్చిపోలేను. నిజ జీవితంలో నాకు ఇలాంటి వ్యక్తులు తారసపడలేదు. కానీ ఇలాంటి కుటుంబం నాకు కూడా ఉంటే బాగుండునే అనిపించింది. ఈ చిత్రంలో నా పాత్రకు చిన్మయి చెప్పిన సంభాషణలు బాగున్నాయి. నాతో సమానంగా చిన్మయికి కూడా అభిమానులున్నారు. నేనే సంభాషణలు చెప్పి ఉంటే ఆమె అభిమానులు బాధపడేవారేమో?'' అన్నారు.

తన సక్సెస్ గురించి చెపుతూ.. ''వేరే హీరోయిన్ కు వచ్చే అవకాశాలు నాకు రావాలని, అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకోవాలని ఆశ లేదు. ఇప్పుడు నాకొస్తున్న అవకాశాలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను నెంబర్‌ వన్‌ అనే భావనను దగ్గరకు కూడా రానివ్వను. నేను ఎన్ని భాషల్లో నటించినా నాకు తెలుగే ప్రధానం. ఈ విషయాన్ని తమిళ ప్రేక్షకుల ముందే చెప్పాను. నాకంటే చాలామంది నాయికలు అందంగా ఉన్నారు. బాగా నటిస్తారు. కానీ వరుస విజయాలు దక్కుతున్నాయంటే నా అదృష్టం కొద్దీ మంచి పాత్రలు దక్కుతున్నాయి. నేను ఏ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గానో స్థిరపడి ఉంటే ఈ హోదా వచ్చేది కాదు కదా! ఒక్క విజయంతో అమాంతం అందలం ఎక్కే అవకాశం ఈ రంగంలోనే ఉంది.''

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X