ప్రిన్స్ మహేష్ గ్లామర్ కి ఫిదా: సమంత
తన కెరీర్ కి బృందావనం సక్సెస్ పటిష్టమైన పునాదిని వేసిందని సమంత అంటున్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..'బృందావనం"లో నేను పోషించిన 'ఇందు" పాత్రను నా లైఫ్ లో మరచిపోలేను. కథకు కేంద్రబిందువు లాంటి పాత్ర అది. గ్లామర్ పరంగానూ, నటన పరంగానూ, డాన్స్ పరంగానూ అన్ని విధాలా నా ప్రతిభను నిరూపించుకునే అవకాశం నాకు ఆ పాత్ర ద్వారా లభించింది. సమంత ఎలాంటి పాత్ర అయినా చేయగలదు.. ఆమెలో మంచి నటి ఉంది అని ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. అందుకే 'బృందావనం" టీమ్ మొత్తానికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నది.
కాగా తన తర్వాత చిత్రం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ మహేష్ ని మించిన అందగాడు లేడంటోంది 'ఏమాయ చేశావె" సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మాయ చేసిన సమంతా. 'బృందావనం" సినిమాలో జూ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించి, తన అందాలతో ప్రేక్షకులకు వల వేసిన సమంతా, ప్రస్తుతం మహేష్ గ్లామర్ ని ఆకాశానికెత్తేస్తోంది. శ్రీనువైట్ల తెరకెక్కించనున్న 'దూకుడు" సినిమాలో మహేష్ సరసన సమంతా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి విదితమే. నిన్న మొన్నటిదాకా జూ ఎన్టీఆర్ గొప్ప డాన్సర్ అనీ, అతనితో వర్క్ చేస్తుంటే టైమ్ అస్సలు తెలియలేదనీ, ఓ రేంజ్ లో డైలాగులు పేల్చిన సమంతా..ఇప్పుడు మహేష్ జపం చేస్తోంది. టాలీవుడ్ లో మహేష్ అందగాడే..ఈ విషయంలో ఎవరికీ డౌట్స్ లేవుగానీ, సమంతా కొడ్తోన్న డబ్బానే, ఆమె హీరోలని ఎలా బుట్టలో వేసుకుంటోందో చెప్పకనే చెబుతోంది.


Click it and Unblock the Notifications











