twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయం చెబితే మహేష్ బాబు చంపేస్తాడు...(సమంత ఇంటర్వ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస విజయాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. నటించిన తమిళ చిత్రం తేరి(తెలగులో పోలీస్) భారీ విజయం సాధించడంతో పాటు, సూర్యకు జోడీగా నటించిన '24' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో విజయానందాన్ని పంచుకున్నారు. పాత్రికేయులతో చిట్ చాట్ చేసారు.

    '24' ఓ ఇంటెలిజెంట్ మూవీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే 'థెరి', '24' చిత్రాలు పెద్ద సక్సెస్ కావడం గర్వంగా కూడా ఉంది. ఇక 'బ్రహ్మోత్సవం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది అని సమంత చెప్పుకొచ్చారు.

    డైరెక్టర్ విక్రమ్ గారు నాకు కథ వినిపించేప్పుడే ఈ సినిమాకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా అనిపించింది. ఈగ సినిమా కథ వినగానే ఎలా ఫీలయ్యానో 24 సినిమా వినగానే అలానే ఫీలయ్యాను. సమంత ఒక సినిమా చేస్తుందంటే దాంట్లో కొంచెమైనా గ్యారంటీగా ఏదో కొత్తగా ఉంటుందని అనుకోవాలి. అందుకనే నేను స్క్రిప్ట్స్ ఎంపికలో కేర్ తీసుకుటానని సమంత తెలిపారు.

    నేను ఏదైనా సినిమా చేస్తున్నానంటే నా పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందనే విషయం ఆలోచిస్తాను. '24' సినిమాలో ఎంత పెద్ద పాత్ర చేసేమని కాదు, సినిమాలో భాగమయ్యామా లేదా అనేదే ముఖ్యం. విక్రమ్ కుమార్ గారి సినిమాల్లో రొమాంటిక్ పార్ట్ చాలా స్వీట్ గా, అందంగా ఉంటుంది. 24 చిత్రంలో కూడా అలానే ఉంటుందని సమంత చెప్పుకొచ్చారు.

    బ్రహ్మోత్సవం గురించి, మహేష్ బాబు కూతురు గురించి సమంత చెప్పిన విషయాలు స్లైడ్ షోలో...

    సూర్య గురించి

    సూర్య గురించి


    సూర్య నటుడిగానే కాదు, సూపర్బ్ ప్రొడ్యూసర్ కూడా. డైరెక్టర్ విక్రమ్ ఆలోచించడం కాదు, ఆయన ఆలోచనను తెరపైకి తీసుకురావడానికి మంచి నిర్మాత అవసరం. సూర్య ఆ జాబ్ ను సమర్దవంతంగా నిర్వహించారు. ఇక నటన విషయానికి వస్తే ఆత్రేయగా ఆయన చేసిన నటన అద్భుతం. ఈ ఏడాది అవార్డులన్నీ ఆయనకే వస్తాయి అన్నారు.

    బ్రహ్మోత్సవంలో పాత్ర గురించి

    బ్రహ్మోత్సవంలో పాత్ర గురించి


    ‘బ్రహ్మోత్సవం'లోని ప్రతి క్యారెక్టర్ కు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. నా పాత్ర విషయానికి వస్తే, చాలా కొత్తగా ఉంటుంది అన్నారు.

    అ ఆ కామెడీ

    అ ఆ కామెడీ


    ‘అఆ' చిత్రంలో నేను కామెడి ఎక్కువగా ఉండే క్యారెక్టర్ చేశాను. ఇంత రేంజ్ లో కామెడి చేయడం ఇదే మొదటిసారి.

    డార్క్ రోల్

    డార్క్ రోల్


    నేను తమిళంలో డార్క్ రోల్స్ చేశాను. తెలుగులో ఇప్పటి వరకు చేయలేదు. ఎవరైనా అలాంటి పాత్రలతో వస్తే చేయడానికి నేను రెడీ అన్నారు సమంత.

    ఆ విషయం చెబితే మహేష్ బాబు చంపేస్తాడు

    ఆ విషయం చెబితే మహేష్ బాబు చంపేస్తాడు


    సితార ఫ్యూచర్లో పెద్ద హీరోయిన్ అవుతుంది. మహేష్ ఈ విషయం చెబితే చంపేస్తాడు అయినా పరావాలేదు..సితార, నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. తను డ్యాన్స్, నవ్వు అన్నీ చూస్తుంటే గౌతమ్ కంటే సితార సూపర్ స్టార్ హీరోయిన్ అయిపోతుందనిపిస్తుంది అన్నారు.

    అలా అంటే మాత్రం...

    అలా అంటే మాత్రం...


    నేను కూడా సీనియర్ హీరోయిన్ అయిపోయానని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కొత్త హీరోయిన్స్ ఎవరైనా స్టేజ్ పై నాకు సమంత అంటే చాలా ఇష్టమని ఎవరైనా అంటే, నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇంకా వెళ్లిపోలేదు అని చెప్పాలనిపిస్తుంది అని సమంత తెలిపారు.

    English summary
    Samantha interview about 24 movie and Brahmostavam, Mahesh Babu daughter Sitara.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X