»   » కనీసం సినిమాల ద్వారా అయినా సంతృప్తి :సమంత

కనీసం సినిమాల ద్వారా అయినా సంతృప్తి :సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''మన సినిమాల్లో ఉమ్మడి కుటుంబాన్ని చాలా అందంగా చూపిస్తుంటారు. ఏ ఫ్రేమ్‌లో చూసినా.. బంధువులూ, స్నేహితులతో కళకళలాడిపోతుంది. ఉదాహరణకు 'బృందావనం' లాంటి సినిమా అన్నమాట. అయితే.. నిజ జీవితంలో అలాంటి కుటుంబాలు మన కంటికి కనిపించడం లేదు. కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.

ఆప్యాయతలు దూరమవుతున్నాయి. కనీసం సినిమాల ద్వారా అయినా.. మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తోంది. ఫాంటసీలతో ప్రేక్షకుడు కాస్తయినా సంతృప్తిచెందుతాడు. వూహల్లో బతికేస్తాడు. అందుకే వూహాతీతంగా ఆలోచించడం, దాన్ని తెరపై చూపించడం మంచిదే..'' అంటోంది సమంత.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Samantha about our movies Fantasy story

మన సినిమా కథలు, వాటిల్లోని సీన్స్ రియాల్టికి, నిజ జీవితానికి మరీ దూరంగా ఉంటాయి. నమ్మశక్యం కాని విషయాల్నీ తెరపై చూపిస్తుంటారు. అంత ఫాంటసీ అవసరమా? అని సమంతను అడిగితే ''అవసరమే. ఎందుకంటే మన కలలు కనీసం అలాగైనా నిజం అవుతున్నాయి కదా?'' అంటోంది. ఇంకొంచెం వివరంగా చెబుతూ పై విధంగా స్పందించింది.

ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే...

ఆమె తెలుగు,తమిళ భాషల్లో బిజీగా ఉంది. అయితే బాలీవుడ్ కి వెళ్లాలని ఆమె అబిమానులు కోరుకుంటున్నారు.
దక్షిణాదిన కొన్ని విజయాలు చేతికి అందగానే ఇక అందరి దృష్టి బాలీవుడ్‌పై పడుతుంది. అక్కడ కూడా నిరూపించుకోవాలన్న తపన మొదలవుతుంది. అయితే సమంతకు అలాంటి ఆలోచనలేం లేదని స్పష్టం చేస్తోంది.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...''నా దగ్గర కూడా కోరికల జాబితా చాలానే ఉంది. మంచి సినిమాలు చేయాలి, మరింత పేరు తెచ్చుకోవాలని ఉంది. అయితే ఈ జాబితాలో హిందీ సినిమా చేయాలన్న కోరిక లేదు..'' అంటోంది సమంత.

అయినా ''హిందీలో నటిస్తేనే హీరోయిన్ గా గుర్తింపు వస్తుందా? దక్షిణాదిన చేతినిండా సినిమాలున్నాయి. నా సత్తా బయటపడిందిక్కడే. నాకంటూ ఓ అభిమాన వర్గం ఉంది. నా కోసం పాత్రలు సిద్ధం చేస్తున్న దర్శకులున్నారు. ఇవన్నీ వదులుకొని, మరో చోట అడుగుపెట్టి నా ఉనికిని చాటుకోవాలా? అంత అవసరం లేదనిపిస్తోంది. అందుకే బాలీవుడ్‌కి వెళ్లాలన్న ప్రయత్నాలేం చేయలేదు. చూద్దాం.. అలాంటి అవకాశం వస్తే, చేయాలనిపిస్తే.. అప్పుడు ఆలోచిస్తా'' అని చెప్పుకొచ్చింది.

    English summary
    Samantha says that all we Want to Live In a Fantasy World like our movies.
    Please Wait while comments are loading...