సమంత ‘పిజ్జా’ ప్రమోషన్
చరితచిత్ర అధినేత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో పి.సమన్యరెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈచిత్రం ఫిబ్రవరి 15న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి ప్రముఖ హీరోయిన్ సమంతతో ప్రమోషన్(ప్రచారం) కార్యక్రమాలను మొదలు పెట్టారు నిర్మాతలు.
ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ...నేను చాలా రోజుల తర్వాత ఒక సూపర్బ్ మూవీ చూసాను. ఆ సినిమా పేరు 'పిజ్జా'. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం తెలుగులో విడుదల కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఎస్.కె. పిక్చర్స్ తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమాగా చూపించబోతున్నందుకు అభిందిస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాని మిస్ కాకూడదు. అందుకే నేను చూసాను. ఈ సినిమా తెలుగులో తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ...పిజ్జా కథ సరికొత్తగా ఉంటుందని, ఫ్యామిలీ యూత్‌ను ఆకట్టుకుంటూ సాగుతుందని, డబ్బింగ్ మరియు రీమేక్ హక్కులకు పోటీ ఉన్నా తమ ఎస్.కె. పక్చర్స్ సంస్థపై నమ్మకంతో అనువాద హక్కులు ఇచ్చారని సురేష్ కొండేటి తెలిపారు. ఇందులో 8 పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయని, ఎంటర్‌టైన్‌మెంట్ శాతం కూడా ఉంటుందని, యూత్‌కు నచ్చే రొమాంటిక్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల వారికి నచ్చే కామెడీతో చిత్రం రూపొందిందని ఆయన వివరించారు.
ఈ చిత్రంలో పిజ్జా సెంటర్ ఓనర్ పాత్రకు నిర్మాత నాగబాబు డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ 'తమిళంలో వచ్చిన సినిమాను అనువదించడం కంటే రీమేక్ చేయడం వల్ల ప్రొడ్యూసర్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే విషయం నేను సురేష్ కి చెప్పాను. కానీ కొన్ని విజువల్స్, కొంత టేకింగ్, కొన్ని ఎమోషన్స్ తిరిగి ప్రొడ్యూస్ చేయడం కష్టమని అతను చెప్పాడు. నేను ఈ సినిమాలో పిజ్జా సెంటర్ ఓనర్ పాత్రకి డబ్బింగ్ చెప్పాను. సురేష్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది' అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: సురేష్ కొండేటి, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు.


Click it and Unblock the Notifications












