twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ పార్టీకి లేదు, చెప్పులమ్మే చోట సమంత కామెంట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తనను అనవసరంగా రాజకీయాల్లోకి లొగ్దదని, తనకు రాజకీయాలపై అసలు ఆసక్తి లేదని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున ప్రచారం చేయడం లేదని హీరోయిన్ సమంత వివరణ ఇచ్చింది. శుక్రవారం ఓ చెప్పుల సంస్థకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఈ విషయాన్ని స్పష్టం చేసారు.

    తన గురించి ఇలాంటి వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కావడం లేదని ఆమె విస్తుపోయారు. తాను ఏ విషయాన్ని అయినా ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తానని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సమంత తెలిపారు. తాను చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకుంటానని చెప్పారు.

    Samantha about politics

    2014 ఎన్నికల్లో సమంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తుందనే వార్తలు వెలువడ్ నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వారిలో కోన రఘుపతి ఒకరు. కోన రఘుపతి కూతురు కోన నీరజ సమంత పర్సనల్ డ్రెస్ డిజైనర్‌గా పని చేస్తోంది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో కోన నీరజ సమంతను ప్రచారం చేయించడానికి ఒప్పించినట్లు వార్తలు వెలువడ్డాయి.

    సమంత సినిమాల విసయానికొస్తే...ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాటు వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తోంది. తమిళంలో అంజాన్, కత్తి అనే చిత్రాలు చేస్తోంది.

    English summary
    Samantha has clarified that she would not be campaigning for any political party this year, despite some rumours that surfaced to this effect.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X