ఇప్పుడు రాజమౌళి కూడా అంతే: సమంత
'ఏ మాయ చేసావె' సమయంలో గౌతమ్‌మీనన్ నన్ను ఓ చిన్నపిల్లలా చూసుకొన్నారు. నా భావాలకు విలువ ఇచ్చారు. ఇప్పుడు రాజమౌళి కూడా అంతే. నన్ను ఇష్టపడే దర్శకులతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె తాజాగా రాజమౌళి చిత్రం 'ఈగ'లో నాని సరసన చేసింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో తనను చాలా గౌరవంగా చూసుకున్నారని ఆమె రాజమౌళికి కితాబు ఇచ్చింది. అలాగే ప్రస్తుతానికి నా వ్యక్తిత్వానికి భంగం కలిగేలా ఎప్పుడూ ఎవరూ ప్రవర్తించలేదు. నా పద్ధతులు ప్రక్కన పెట్టి పనిచేసే అవసరం ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం అందామె. ఇక ఇప్పటికే 'ఈగ'చిత్రం ప్రోమోలు అంతటా విడుదలయ్య ఓ రేంజిలో పెద్ద హీరోల సినిమాలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాయి.
ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఈగ'గురించే చర్చ. ఈ చిత్రంపై రాజమౌళి చాలా కాన్ఫిడెండ్ గా ఉన్నారు. అలాగే ఈగ బడ్జెట్ ముప్పై కోట్లు దాటిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చాలా చిన్న బడ్జెట్ అనుకుని నాని వంటి చిన్న హీరోతో ప్రారంభించిన ఈ చిత్రం అనుకోని విధంగా గ్రాఫిక్స్ హంగామాతో ఈ రేంజి బడ్జెట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. అయితే రాజమౌళి కి ఉన్న బిజినెస్ స్టామినాని బట్టి ఈ మొత్తం పెద్దది కాదని,సినిమాపై ఉన్న భారీ అంచనాలు,మిగతా భాషల్లోకి వెళ్లే అవకాసం ఇవన్నీ బడ్జెట్ కు సహకరించే అంశాలు అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభం రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి చిత్రం కావటం,కొత్త కాన్సెప్టు తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే కథ కావటం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
పెరిగిన అంచనాలకు ఈ బడ్జెట్ పెద్ద మొత్తమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకుల అంటున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఇక 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.
ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్ సూర్య' ' రామ్ చరణ్ ' ఎవడు' మణిరత్నం ' కాదల్' గౌతమ్ మీనన్ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.


Click it and Unblock the Notifications











