ఎన్టీఆర్ మూవీ: నరకం అంటూ సమంత ట్వీట్
హైదరాబాద్ : హాట్ లేడీ సమంత ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలో షూటింగ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ రోజు(మే 18) రామోజీ ఫిల్మ్ సిటీలో పట్టపగలు రోడ్లపై షూటింగ్ ప్లాన్ చేసారు.
ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...'అసలే ఎండలు మండి పోతున్నాయి. ఇదే సమయంలో రామెజీ ఫిల్మ్ సిటీలో పట్టపగలు రోడ్లపై షూటింగ్. నరకం ఎలా ఉంటుందో తెలుసుకోవడాలంటే రామోజీ ఫిల్మ్ సిటీకి రండి' అంటూ ట్వీట్ చేసింది. అంతే కాదు తన సెక్సీ ఫోటో కూడా ఒకటి సోషల్ నెట్వర్కింగ్‌లో షేర్ చేసి అందరితో సూపర్ అనిపించుకుంటోంది. ఇక్కడ కనిపిస్తున్నదే ఆ ఫోటో..
రామయ్యా వస్తావయ్యా సినిమా విషయానికొస్తే...శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











