స్వేచ్ఛ కోల్పోలేదు, కానీ చాదస్తం పెరిగింది: పెళ్లి తర్వాత పరిస్థితిపై సమంత
Recommended Video

సినిమాల్లో సక్సెస్ అయిన హీరోయిన్ సమంత.... ఇటు ప్రేమలో కూడా విజయం సాధించింది. తను ప్రేమించిన నాగ చైతన్యను వివాహం చేసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ ఫ్యామిలీ అక్కినేని కుటుంబంలోకి కోడలుగా వెళ్లింది. పెళ్లి తర్వాత సమంత ఎంతో సంతోషకరమైన జీవితం గడుపుతోంది. అయితే పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో మాత్రం మార్పు వచ్చిందని సమంత చెబుతోంది.

స్వేచ్ఛను కోల్పోవాల్సిన అవసరం రాలేదు
పెళ్లి తర్వాత స్వేచ్ఛను కోల్పోవాల్సిన అవసరం రాలేదని, అయితే తనలో చాదస్తం మాత్రం బాగా పెరిగిందని సమంత చెప్పుకొచ్చారు. పెళ్లికి ముందు కూడా నాలో చాదస్తం ఉండేది, కానీ పెళ్లి తర్వాత ఇది మరింత ఎక్కువైందని సమంత తెలిపారు.

కొన్ని కథలు నచ్చడం లేదు
పెళ్లికి ముందుతో పోల్చుకుంటే ఇపుడు కొన్ని రకాల కథలు నచ్చడం లేదని, బహుషా ఇది పెళ్లి ప్రభావం వల్లనే ఏమో అనే సందేహం సమంత వ్యక్తం చేశారు. మంచి సినిమాలు చేతిలో ఉండటం వల్లే నచ్చని కథలను వదిలేస్తున్నానని సమంత తెలిపారు.

వరుస సినిమాలతో సమంత బిజీ
ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో ‘రంగస్థలం', ‘మహానటి', తమిళంలో ‘ఇరుబుతిరై', ‘సూపర్ డీలక్స్' చిత్రాల్లో సమంత నటిస్తున్నారు.

నిర్మాతగా సమంత
పెళ్లి తర్వాత సమంత తన కెరీర్ కు సంబంధించి మరో మెట్టు ఎక్కబోతున్నారు. నిర్మాతగా సినిమా చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు 'యూటర్న్' అనే కన్నడ సినిమా రైట్స్ కొనుగోలు చేసి దాన్ని తెలుగులో తీసేందుకు ప్లాన్ చేస్తోంది. కన్నడ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్‌కుమార్ తెలుగులో తెరకెక్కనున్న చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ‘యూ టర్న్' మూవీ డీల్ కోసం తన భర్త నాగచైతన్యతో కలిసి ఇటీవల బెంగళూరు వెళ్లిన సమంత సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చిందట.


Click it and Unblock the Notifications











